RTGS services
-
ఆ రోజున నెఫ్ట్ సేవలకు అంతరాయం
ముంబై: మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఆన్లైన్ లావాదేవీల కోసం జరిపే నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) సేవలు మే 23 రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. నెఫ్ట్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు నెఫ్ట్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు ఆర్టీజీఎస్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆర్టీజీఎస్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. ఏప్రిల్ 18న ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి టెక్నికల్ అప్‌గ్రేడ్ చేపట్టిన విషయం మనకు తెలిసీందే. 2019 డిసెంబరు నుంచి నెప్ట్ సేవలను 24×7 గంటల పాటు ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. NEFT System Upgrade – Downtime from 00.01 Hrs to 14.00 Hrs. on Sunday, May 23, 2021https://t.co/i3ioh6r7AY — ReserveBankOfIndia (@RBI) May 17, 2021 చదవండి: ట్యాక్స్ రిటర్నులు రద్దు అయితే ఏం చేయాలి? -
ఎంత డబ్బైనా ఇక ఈజీగా పంపొచ్చు
న్యూఢిల్లీ, సాక్షి: నేటి నుంచి ఏడాది పొడవునా.. 24 గంటలూ ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రూ. 2 లక్షలు.. అంతకుమించి పెద్ద మొత్తాలను ఆన్లైన్ ద్వారా సులంభంగా బదిలీ చేసేందుకు వీలు చిక్కింది. వాస్తవ సమయానుగుణంగా సర్వీసులు అందుబాటులోకి రావడంతో భారీ సొమ్మును సైతం త్వరగా బదిలీ చేసేందుకు అవకాశమున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రోజంతా ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోగల ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లు తెలియజేశాయి. నగదు బదిలీ సేవలలోగల ఐదు ముఖ్యమైన పాయింట్లను చూద్దాం.. (జనవరి 1నుంచి చెక్కులకు కొత్త రూల్స్) ఈజీగా.. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి సొమ్ము రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్(ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ కానుంది. ఇందుకు బ్యాంకులు అదనంగా ఎలాంటి చార్జీలనూ విధించబోవు. నేటి నుంచి ఏడాది పొడవునా.. 24 గంటలూ ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ఆన్లైన్(ఇంటర్నెట్)తోపాటు.. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. బ్రాంచీని సందర్శించడం ద్వారా ఆఫ్లైన్లోనూ ఈ సర్వీసులను పొందవచ్చు. కనీసం రూ. 2 లక్షల మొత్తాలను ఆర్టీజీఎస్ ద్వారా పంపించవచ్చు. ఈ విధానంలో గరిష్ట పరిమితిలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. నెఫ్ట్ బాటలో చిన్న మొత్తాలను పంపించుకునేందుకు అమలులో ఉన్న నెఫ్ట్ సేవలను ఆర్బీఐ ఏడాది క్రితమే రోజంతా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బాటలో తాజాగా ఆర్టీజీఎస్ సేవలనూ 24 గంటలకు ఆర్బీఐ పొడిగించింది. 4 ప్రధాన బ్యాంకుల ద్వారా 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ సేవలు దేశీయంగా తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 237 బ్యాంకుల ద్వారా రోజుకి 6.35 లక్షల లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ. 4.17 లక్షల కోట్లుకావడం విశేషం! సగటున ఆర్టీజీఎస్ ద్వారా రూ. 57.96 లక్షలు బదిలీ అవుతున్నట్లు నవంబర్ నెల డేటా తెలియజేసింది. దేశీయంగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రమోట్ చేసే బాటలో ఆర్బీఐ నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలపై అదనపు చార్జీలను విధించవద్దంటూ బ్యాంకులను ఆదేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఇక రోజంతా ఆర్టీజీఎస్ సర్వీసులు
ముంబై: పెద్ద మొత్తంలో నగదు బదిలీ లావాదేవీలకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సర్వీసులు ఇకనుంచీ రోజంతా 24 గంటలూ .. అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానం ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇలాంటి సర్వీసులను ఏడాది పొడవునా, వారమంతా, ఇరవై నాలుగ్గంటలూ అందిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంది. దీన్ని సుసాధ్యం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ .. ట్విటర్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నిధుల బదలాయింపునకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని, అంతకు మించితే ఆర్టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నెఫ్ట్ సేవలు ఇప్పటికే రోజంతా అందుబాటులో ఉంటుండగా.. తాజాగా ఏడాది తర్వాత ఆర్టీజీఎస్ సేవలను కూడా ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో నాలుగు బ్యాంకులతో మొదలైన ఈ విధానం ద్వారా ప్రస్తుతం రోజుకు రూ. 4.17 లక్షల కోట్ల విలువ చేసే 6.35 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుగుతున్నాయి. 237 బ్యాంకులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. 2020 నవంబర్‌లో ఆర్టీజీఎస్లో సగటు లావాదేవీ పరిమాణం రూ. 57.96 లక్షలుగా నమోదైంది. జైపూర్‌లో బ్యాంక్‌నోట్ ప్రాసెసింగ్ సెంటర్ బ్యాంక్ నోట్ల చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ కోసం జైపూర్‌లో ఆటోమేటెడ్ బ్యాŠంక్నోట్ ప్రాసెసింక్ కేంద్రాన్ని (ఏబీపీసీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి వచ్చే కరెన్సీ నోట్ల జమ, నిల్వ, డిస్పాచ్ మొదలైన కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఏబీపీసీ ఏర్పాటుకు అవసరమయ్యే సేవల నిర్వహణ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆర్బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 2039–40 నాటికి దశలవారీగా సగటున రోజుకి 685 కోట్ల కొత్త నోట్లను, 2,775.7 కోట్ల పాత నోట్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఏబీపీసీని రూపొందించనున్నారు. 2001 మార్చి నుంచి 2019 మార్చి దాకా చలామణీలో ఉన్న బ్యాంక్ నోట్ల పరిమాణం 3 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుతుందని అంచనా. -
డిజిటల్ లావాదేవీలు : ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: వరుసగా మూడవ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరోకీ లక నిర్ణయం తీసుకుంది. మరింత కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వాడకాన్ని ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితినిపెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న కాంటాక్ట్ లెస్ కార్డు లావాదేవీల పరిమితిని 2 వేల రూపాయలనుంచి 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. (ఆర్బీఐ ఎఫెక్ట్- 45,000 దాటిన సెన్సెక్స్) ముఖ్యంగా ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సమర్ధవంత, సురక్షితమైన, డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని శక్తికాంత దాస్ చెప్పారు. 24గంటలు,వారంరోజుల పాటు (24x7) ఆర్టీజీఎస్ వ్యవస్థ అందుబాటులో ఉండేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కీలక వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో రెపో రేటు 4శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. ఈ నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కొవిడ్-19 ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గిస్తూ.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు తీసుకుంటోందని శక్తికాంత దాస్ చెప్పారు. (చదవండి : కల్తీ తేనె కలకలం : మరింత కరోనా ముప్పు) -
కస్టమర్లకు ఊరట : ఇక ఆర్టీజీఎస్ సేవలు 24x7
ముంబై : బ్యాంకు ఖాతాదారులకు ఊరటగా నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) ఇక వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారం మినహా మిగిలిన అన్ని వర్కింగ్ డేస్‌లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మనీ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ సదుపాయాన్ని ఆర్బీఐ నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చిన క్రమంలో తాజా ప్రకటన వెలువడింది. నెఫ్ట్ వ్యవస్థను గత ఏడాది డిసెంబర్ నుంచి 24x7 అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి సాఫీగా సాగుతోందని, ఇక పెద్ద మొత్తాల బదిలీకి ఉద్దేశించిన ఆర్టీజీఎస్ సిస్టం సైతం ఇప్పుడు కస్టమర్లకు వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. ఆర్టీజీఎస్ కింద రూ 2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు బదలాయించవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా పంపే నగదుపై గరిష్ట పరిమతి లేకున్నా పలు బ్యాంకులు రూ 10 లక్షలను గరిష్ట మొత్తంగా పరిమితి విధించాయి. చదవండి : వడ్డీ రేట్లు యథాతథం -
కొత్త కార్డు కావాలా నాయనా..
సాక్షి, గరుగుబిల్లి(విజయనగరం) : రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సామాన్యులు రేషన్‌కార్డు పొందాలంటే గగనమైపోతుంది. కార్డు కోసం ముప్పతిప్పలు పెడుతున్నారు. జన్మభూమి సభల్లో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా, కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా చివరకు మొండి చేయే చూపుతున్నారు. తాజాగా కొత్త రేషన్‌కార్డు కావాలంటే 1100కు ఫోన్ చేయాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. తరువాత ఒక ప్రైవేటు సంస్థ రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్) సంస్థ ద్వారా వివరాలను సేకరిస్తుంది. అవగాహన లేమి... రేషన్ కార్డు మంజూరులో ప్రజలకు అవగాహన కల్పించకుండా కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. గతంలో మాదిరిగా తహసీల్దార్ కార్యాలయంలోను, వివిధ సభల్లోను దరఖాస్తులు చేయనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ 1100 ద్వారా రేషన్‌కార్డును పొందే అవకాశం కల్పించారు. ఈ నెంబరు రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పరిధిలో ఉంటుంది. కార్డు కావాల్సిన వారు తమ ఫోన్ నుంచి 1100లకు ఫోన్ చేయాలి. అటునుంచి అడిగిన మేరకు పేరు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు తెలియజేయాలి. ఆ తరువాత సదరు వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అధికారులు దర్యాప్తు చేసి కార్డుకు సిఫార్సు చేస్తారు. అయితే మారుతున్న టెక్నాలజీ తెలియని ప్రజలు మీసేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయాలకు తిరుగుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఇలా... కొత్తగా తెలుపు రేషన్ కార్డు కావాలంటే ఆర్టీజీఎస్లో నమోదు కావల్సి వుంది. వారు పూర్తిగా ప్రజా సా«ధికార సర్వే వివరాలపై ఆధార్ పడి ఈ కార్డు మంజూరు చేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా ప్రజాసాధికార సర్వేలో వివరాలు లేకపోతే కార్డు మంజూరు కాదు. సర్వే ఆధారంగా వారి ఆస్తులు, ఇళ్లు, వాహనాలు, ఇతర వివరాలు ఆర్టీజీఎస్లో బహిర్గతమవుతాయి. దరఖాస్తు దారునికి 500 గజాలు మించి ఇళ్లు, ఐదు ఎకరాల పొలం, నాలుగు చక్రాల వాహనం వంటివి నమోదై ఉంటే తెలుపు రేషన్ కార్డు మంజూరు కాదు. ఏ కార్డులో పేరు నమోదై ఉండకూడదు రేషన్ కార్డు కోసం చేసుకొన్న దరఖాస్తుదారు ఏ ఒక్క కార్డులో నమోదై ఉండకూడదు. ఏ కార్డులో కూడా నమోదు కానివారు కొత్త కార్డు కోసం 1100 ద్వారా చేయాలి. అలాగే ప్రజాసాధికార సర్వేలో వారి తల్లిదండ్రులతో కలిసి నమోదై ఉండకూడదు. ఒక వేళ ఉంటే, వారు సంబంధిత తహసీల్దార్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా సా«ధికార సర్వేలో స్పిల్టింగ్ (వేరుగా ఉన్నట్లు) చేసుకోవాలి. అప్పుడే కొత్త కార్డు పొందేందుకు అర్హులవుతారు. అవగాహన కల్పిస్తున్నాం... కొత్తగా రేషన్‌కార్డు కావాలనే వారికి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నాం. వీఆర్ఓల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కార్డు కావాలనే వారు తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వే చేయించుకోవాలి. ఏ కార్డులో నమోదు కాని వారు మాత్రమే 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోను చేయాలి. – పి.సోమేశ్వరరావు, తహసీల్దార్, గరుగుబిల్లి -
సర్కారీ నివేదికల డేంజర్ బెల్స్
-
2,4 శనివారాల్లో ఆర్టీజీఎస్ సేవలూ బంద్
ముంబై: ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఆయా రోజుల్లో ఇకపై ఆర్టీజీఎస్ సేవలు కూడా అందుబాటులో ఉండవని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగతా శనివారాల్లో మాత్రం పూర్తిగా రోజంతా సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆర్టీజీఎస్ వేళల్లో కూడా మార్పులు చేసినట్లు ఆర్బీఐ వివరించింది. దీని ప్రకారం రెండో, నాలుగో శనివారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఆర్టీజీఎస్ వేళలు ఉదయం 8 గం. ల నుంచి సాయంత్రం 4.30 గం.ల దాకా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ కటాఫ్ సమయం మధ్యాహ్నం 2 గం.ల దాకానే ఉంది. ఆన్లైన్లో రూ. 2 లక్షలకు మించి నగదు బదిలీ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్)గా వ్యవహరిస్తారు.