RTGS
-
రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం..
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ చెప్పారు. కేంద్ర ఆర్థికశాఖ సమక్షంలో ఇటీవల జరిగిన భేటీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సన్నద్ధత గురించి చర్చించామని మంత్రి కరద్ పేర్కొన్నారు. సైబర్ దాడులు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అవకతవకలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థిక మోసాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబరు 4, 2023 వరకు జరిగిన 4 లక్షలకు పైగా సంఘటనల్లో ఈ వ్యవస్థ మొత్తం రూ.1,000 కోట్లకు మించి ఆదా చేసిందని పేర్కొన్నారు. పలువురి ఖాతాల్లో నవంబర్, 2023లో పొరపాటున జమ అయిన రూ.820 కోట్లకు గాను రూ.705.31 కోట్లను యూకో బ్యాంక్ రికవరీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఈ సమావేశంలో వెల్లడించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ ఛానెల్లో సాంకేతికలోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొరపాటున ఈ నిధులు జమ అయినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి నవంబర్ 15న యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజినీర్లు, ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని 13 ప్రదేశాల్లో డిసెంబర్ 5న సీబీఐ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిళ్లకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్‌లతో సహా వివిధ ఛానెల్‌ల ద్వారా యాక్సెస్ చేయగల 24/7 ఇంటర్‌బ్యాంక్ మొబైల్, ఐఎంపీఎస్‌లో లోపం ఏర్పడినట్లు విచారణలో తేలిందని అధికారులు వివరించారు. -
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త!
ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇక మీ జీతం, పెన్షన్ డబ్బులు సెలవు రోజుల్లో పడనున్నాయి. ఇప్పటి వరకు వేతనం, పెన్షన్ డబ్బులు, ఈఎమ్ఐ చెల్లింపులు చేయడం అనేది బ్యాంక్ సెలవు రోజుల్లో వీలు కాకపోయేది. కానీ, కొత్తగా ఆర్బీఐ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా మీ జీతం, పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కానున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ పనిదినాల కోసం మీ జీతం లేదా పెన్షన్ డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ఏసీహెచ్ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు ఎన్ఏసీహెచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు నెల మొదటి రోజు వారాంతంలో వస్తుంది. దీని కారణంగా ప్రజలు బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండాలి. జూన్ క్రెడిట్ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వినియోగదారుల అందించే సేవలను మరింత పెంచడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. -
ఆ రోజున నెఫ్ట్ సేవలకు అంతరాయం
ముంబై: మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఆన్లైన్ లావాదేవీల కోసం జరిపే నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) సేవలు మే 23 రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. నెఫ్ట్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు నెఫ్ట్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు ఆర్టీజీఎస్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆర్టీజీఎస్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. ఏప్రిల్ 18న ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి టెక్నికల్ అప్‌గ్రేడ్ చేపట్టిన విషయం మనకు తెలిసీందే. 2019 డిసెంబరు నుంచి నెప్ట్ సేవలను 24×7 గంటల పాటు ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. NEFT System Upgrade – Downtime from 00.01 Hrs to 14.00 Hrs. on Sunday, May 23, 2021https://t.co/i3ioh6r7AY — ReserveBankOfIndia (@RBI) May 17, 2021 చదవండి: ట్యాక్స్ రిటర్నులు రద్దు అయితే ఏం చేయాలి? -
బ్యాంకు ఖాతాదారులకి ఆర్బీఐ అలర్ట్!
మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి అలర్ట్. దేశవ్యాప్తంగా రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సేవలు ఏప్రిల్ 18న రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. ఆర్టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్టీజీఎస్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవల్ని వినియోగించుకోవచ్చు. నెఫ్ట్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్బీఐ. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. రూ.2,00,000 కన్నా ఎక్కువ ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. అంటే కస్టమర్లు ఎప్పుడైనా ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. గతంలో ఆర్టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. భారతదేశంలో ఆర్టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2019 జూలైలో ఆర్టీజీఎస్తో పాటు నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసింది ఆర్బీఐ. చదవండి: పసిడి పరుగులకు బ్రేక్! -
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్ అంచనాలకు అనుగుణంగా సాగింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 4 శాతంగానే కొనసాగించాలని శుక్రవారం వరకూ వరుసగా మూడు రోజులుగా సాగిన గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ధరల స్పీడ్ (2019 ఇదే కాలంలో పోల్చి) ఎక్కువగానే ఉందని అభిప్రాయపడ్డ విధాన ప్రకటన తరువాతి త్రైమాసికాల్లో ఇది దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వడ్డీరేట్లు మరింత తగ్గేందుకే అవకాశం ఉందని మార్కెట్‌కు సూచించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. 2021 ఏప్రిల్–జూన్‌లో 20.6 శాతం వృద్ధి! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) ఎకానమీ 9.5 శాతం క్షీణిస్తుందని అంచనావేసింది. 2020–21 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 23.9 శాతం క్షీణతను ప్రస్తావిస్తూ, సెప్టెంబర్ , డిసెంబర్ త్రైమాసికాల్లోనూ క్షీణ రేటే నమోదవుతుందని అంచనా. ఈ క్షీణ రేట్లను వరుసగా 9.8 శాతం, 5.6 శాతంగా లెక్కగట్టింది. అయితే చివరి త్రైమాసికం అంటే జనవరి–మార్చి త్రైమాసికంలో స్వల్పంగా 0.5 శాతం ఆర్థికాభివృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–2021 జూన్) భారీగా 20.6 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తోంది. ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ (2020లో దారుణ పతన స్థితి) మరీ తక్కువగా ఉండడం కారణమని ఆయా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు చక్కటి తోడ్పాటును అందిస్తుందని విధాన కమిటీ అంచనావేసింది. మొత్తంగా చూస్తే, కరోనా వైరస్‌పై పోరులో భారత్ ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని, కరోనా కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగివస్తుంది సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి అంచనాల ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం. (ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ఈ రేటు మైనస్ 2 లేదా ప్లస్ 2తో 4 శాతం వద్ద కొనసాగాలి. సరఫరాలు– డిమాండ్ మధ్య అసమతౌల్యత కారణంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుంది. దీనికితోడు వ్యవసాయ రంగం పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంది. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. చిన్న పరిశ్రమలకు ఊరట రిటైల్ రుణ గ్రహీతలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే విషయంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు లభించింది. ఇందుకు సంబంధించిన పరిమితిని (ఫండ్ అండ్ నాన్–ఫండ్ ఆధారిత) రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు పెంచింది. దీనికితోడు ఈ రుణాల మంజూరీకి సంబంధించి మూడవ పార్టీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల (సీఆర్ఏలు) నుంచి బ్యాంక్ లోన్ రేటింగ్ (బీఎల్ఆర్)ను బ్యాంకులకు పొందాల్సిన అవసరం లేదు. ఎగుమతిదారులకు వరం ఎగుమతిదారుల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తూ, సిస్టమ్ ఆధారిత ఆటోమేటిక్ కాషన్ లిస్టింగ్‌ను మినహాయించింది. దీనివల్ల విదేశీ కొనుగోలుదారులతో ఎగుమతిదారులు మరింత మెరుగైన రీతిన లావాదేవీలు నిర్వహించగలుగుతారు. అలాగే ఎగుమతుల ద్వారా సముపార్జించిన మొత్తాన్ని మరింత సులభతరమైన రీతిలో అందుకోగలుగుతారు. 2016లో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఈడీపీఎంఎస్)– ‘కాషన్/డీ–కాషన్ లిస్టింగ్ ప్రకారం... రెండేళ్లు పైబడిన షిప్పింగ్ బకాయిల విషయంలో ఎగుమతిదారుడు కొన్ని ప్రతికూల పరిస్థితును ఎదుర్కొనాల్సి ఉంటోంది. కరోనా కష్టకాలంలో ఎగుమతిదారుపై మరిన్ని నియంత్రణలు తగదని ఆర్బీఐ పాలసీ భావిస్తోంది. ద్రవ్య లభ్యతకు ఢోకా ఉండదు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు ఉంటాయి. వచ్చే వారం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (వోఎంవో) వేలం ద్వారా రూ.20,000 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే రూ.లక్ష కోట్లను అందుబాటులో ఉంచడానికి వీలుగా మూడేళ్ల కాలపరిమితితో దీర్ఘకాలిక రెపో చర్యలను (టీఎల్టీఆర్ఓ) ఆర్బీఐ తీసుకుంటుంది. ఇందుకుగాను ఫ్లోటింగ్ రేటును మార్చి 31, 2021 వరకూ ఉండే పాలసీ రెపో రేటుతో అనుసంధానించడం జరుగుతుంది. దిశా నిర్దేశం... విధాన నిర్ణయం వృద్ధి పునరుద్ధరణకు తగిన మార్గదర్శకాన్ని సూచించింది. ఆర్థిక వ్యవస్థను పాలసీ ప్రతిబింబిస్తోంది. ‘అధికారిక నిర్ణయాల’ ప్రాతిపదికన కాకుండా, ‘దిశా నిర్దేశం’ ప్రాతిపదికన వృద్ధికి ఊతం ఇవ్వాలని పాలసీ భావిస్తోంది. – దినేష్ కుమార్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ మరోదఫా రేటు కోత విధాన నిర్ణయాలను పరిశీలిస్తే, డిసెంబర్లో లేదా ఫిబ్రవరి పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటు కోత అవకాశం ఉంది. ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి ఇబ్బందిలేని పరిస్థితిపై పరపతి విధాన కమిటీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. – అభీక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ రియల్టీకి సానుకూలం గృహ రుణాలపై రిస్క్ వెయిటేజ్ హేతుబద్దీకరణ రియల్టీకి సానుకూల అంశం. ఈ రంగంలో రుణ లభ్యత పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. అయితే పరిశ్రమ పురోగతికి, డిమాండ్ పెరగడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. – సతీష్ మగార్, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వృద్ధికి మార్గం... వృద్ధి రికవరీ దిశలో ఆర్బీఐ తగిన నిర్ణయాలను తీసుకుంది. ద్రవ్య లభ్యత, ఎగుమతులు, రుణ వృద్ధి పలు అంశాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఆయా రంగాలకు ఊరటనిస్తాయి. ముఖ్యంగా మరోదఫా రేటు కోతకు అనుగుణమైన విధానం హర్షణీయం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ ఆర్టీజీఎస్ సేవలు ఇక 24x7 డిసెంబర్ నుంచి అమల్లోకి ముంబై: భారీ స్థాయిలో నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే దిశగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) విధానాన్ని ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారం మినహా వారంలోని అన్ని పని దినాల్లో ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 గం. దాకా ఆర్టీజీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. ‘భారీ స్థాయి చెల్లింపుల వ్యవస్థను ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో తెచ్చిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుంది‘ అని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2 లక్షల పైబడిన ఆర్థిక లావాదేవీలకు ఆర్టీజీఎస్ విధానాన్ని, రూ. 2 లక్షల లోపు లావాదేవీలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ ఏడాది పొడవునా, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు లైసెన్సింగ్ సంబంధ అనిశ్చితిని తగ్గించేందుకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఇచ్చే ఆథరైజేషన్ సర్టిఫికెట్ (సీవోఏ)ను సుదీర్ఘకాలం వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. గృహ రుణాలపై రిస్క్ వెయిటేజ్ హేతుబద్దత గృహ రుణాలకు సంబంధించి రిస్క్ (మొండిబకాయిగా మారే అవకాశాలు) వెయిటేజ్‌ని ఆర్బీఐ హేతుబద్దీకరించింది. అన్ని కొత్త గృహ రుణాలకు సంబంధించి రిస్క్ వెయిటేజ్ ఇకపై ఒకేగాటన కాకుండా, ‘లోన్ టూ వ్యాల్యూ నిష్పత్తి’కి అనుసంధానమై ఉంటుంది. ఇందుకు అనుగుణమైన విధంగా రుణ గ్రహీతలు వివిధ సంస్థల నుంచి తగిన వడ్డీరేటు ప్రయోజనాలు పొందవచ్చు. కొత్త విధానం 2022 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కరోనా.. క్రికెట్.. ఆర్బీఐ పాలసీ.. ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రకటనలో క్రికెట్ పరిభాష ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ ప్రకటనలో ఈసారి క్రికెట్ పరిభాష కూడా చోటు దక్కించుకుంది. రికవరీ ప్రక్రియ, వివిధ రంగాల పరిస్థితుల గురించి ఉటంకిస్తూ .. ఆఖరి ఓవర్లు, ఖాతా తెరవడం, ఇన్నింగ్స్ కాపాడుకోవడం వంటి పదాలను దాస్ ప్రస్తావించారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఎకానమీ కోలుకునే ప్రక్రియను వివరించే ప్రయత్నం చేస్తూ ‘నా అభిప్రాయం ప్రకారం రికవరీ మూడంచెలుగా ఉండవచ్చు. కరోనాను కూడా తట్టుకుని నిలబడిన రంగాలను అన్నింటికన్నా ముందుగా ’పరుగుల ఖాతా తెరిచిన’ వాటిగా పరిగణించవచ్చు. వ్యవసాయం, ఎఫ్ఎంసీజీ, వాహనాలు, ఫార్మా మొదలైనవి ఈ కేటగిరీలోకి వస్తాయి. మాంచి ‘స్ట్రైక్ ఫామ్’లో ఉన్నవి రెండో కోవలోకి వస్తాయి. కార్యకలాపాలు క్రమంగా మళ్లీ సాధారణ స్థాయికి వస్తున్న రంగాలు ఇందులో ఉంటాయి. ఇక ‘ఆఖరు ఓవర్లను’ (తీవ్ర ఒత్తిడిని) ఎదుర్కొని బరిలో నిల్చి, ఇన్నింగ్స్‌ను కాపాడే రంగాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. సామాజిక దూరం వంటి నిబంధనలతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాలు ఇందులో ఉన్నాయి’ అని దాస్ పేర్కొన్నారు. -
ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్ర-ఉత్తర తమిళనాడు మధ్య అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఏర్పడిన చోటు నుంచి ఉత్తరాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. అలాగే బుధ, గురు వారాల్లో కూడా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలోని వాగులు, వంకలు, నదులు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపిన ఆర్టీజీఎస్.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
ఆర్టీజీఎస్ వేళలు మార్పు
ముంబై: భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్టీజీఎస్ సిస్టమ్ వేళలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్లైన్లో బదిలీ చేయొచ్చు. దీని వేళలు ఇప్పుడు కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల కోసం రాత్రి 7.45 దాకా ఉం టున్నాయి. ప్రస్తుతం రూ. 2 లక్షల లోపు నిధుల బదిలీ కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) ఉపయోగిస్తున్నారు. దీని వేళలు ఉదయం 8 నుంచి రాత్రి 7 దాకా ఉంటున్నాయి. కార్డు చెల్లింపులకూ ఈ–మాండేట్... వర్తకులు, వ్యాపార సంస్థలకు క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్ వంటివాటిద్వారా తరచూ చేసే చెల్లింపులకు కూడా ఈ–మాన్డేట్ విధానాన్ని వర్తింపచేసేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీనికి రూ. 2,000 దాకా లావాదేవీ పరిమితి ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్ టైమ్ పాస్వర్డ్ వంటివి ఉపయోగించాల్సి వస్తున్నందువల్ల లావాదేవీకి ఎక్కువ సమయం పడుతోంది. తాజా వెసులుబాటుతో చిన్న మొత్తాల చెల్లింపు సులభతరమవుతుంది. ఈ–మాన్డేట్కు నమోదు చేసుకున్నందుకు కార్డ్‌హోల్డరు నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరాదని బ్యాంకులు/ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. -
బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్ నూతన సీఈవో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ నూతన (ఆర్టీజీఎస్) సీఈవోగా ఎన్.బాలసుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ కమాండ్ సెంటర్లో బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీజీఎస్ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’కు సాంకేతిక తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీజీఎస్ను ముందుకు తీసుకెళ్లతామని పేర్కొన్నారు. -
ఎండలో తిరగకుండా జాగ్రత్త పడండి
సాక్షి, అమరావతి : భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతోంది. మధ్యాహ్నం వేళలో 44డిగ్రీల చేరుతున్న ఉష్ణోగ్రతలు ఇబ్బందిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కొన్ని సూచనలు చేసింది. ప్రజలు ఎక్కువగా ఎండల్లో తిరుగకుండా ఉండాలని సూచించింది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయని, జిల్లాలోని విజయపురంలో 46.02, నగరిలో 46, వరదయ్యపాలెంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో 45, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 45. 49, ప్రకాశంలో 44. 67, నెల్లూరులో 44.10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాని తెలిపింది. -
రోజుకు 20 లక్షల మందికి ఫోన్ చేస్తున్నారట!
సాక్షి, అమరావతి: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) పేరుతో ప్రైవేట్ సంస్థ కార్వీకి ఖజానా నుంచి ప్రభుత్వం అడ్డగోలుగా నిధులు దోచిపెడుతోంది. పేరుకు మాత్రమే ఆర్టీజీఎస్.. కానీ, అది చేసేది కాల్‌సెంటర్ పని. ‘1100’ కాల్ సెంటర్ నిత్యం 24 గంటలూ పని చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 24 గంటలు పనిచేయడానికి ఇదేమైనా పోలీసు స్టేషనా? లేక ఆసుపత్రా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 24 గంటలు పని అంటే రాత్రి 12 తరువాత కూడా ప్రజలు ఫోన్ చేసి, తమ సమస్యలు చెప్పుకుంటునాజ్నరా? కాల్ సెంటర్ సిబ్బంది అర్ధరాత్రి తరువాత కూడా ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అవన్నీ బోగస్ లెక్కలు జనం అర్ధరాత్రి తర్వాత కూడా ఫోన్లు చేస్తున్నారా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారంటూ ఇటీవలి వరకు సీఎస్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రోజుకు 20 లక్షల మందికి ఫోన్ చేస్తున్నారని ఆర్టీజీఎస్ అధికారులు చెప్పడంపైనా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్ పనితీరు గొప్పగా ఉందంటూ అధికారులు వివరించగా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిరోజూ లక్షల మంది ఫోన్లు చేయడం సాధ్యమేనా? థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడమేమిటని ప్రశ్నించారు. నామినేషన్‌పై నిధుల పందేరం ‘1100’ కాల్ సెంటర్ మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటలూ పని చేస్తుందని అధికారులు అంటున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11వరకు మరో షిఫ్ట్, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 వరకు మరో షిఫ్ట్‌లో ఈ కాల్ సెంటర్ పనిచేస్తోందని చెబుతున్నారు. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 లోపు కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తే ఎవరైనా స్పందిస్తారా? లేక ఎవరైనా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 మధ్య కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆర్టీజీఎస్ సేవల కోసం చంద్రబాబు సర్కారు కార్వీ సంస్థకు నామినేషన్‌పై ఇప్పటిదాకా రూ.295.38 కోట్లు దోచిపెట్టింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేశారు. ఆర్టీజీఎస్కు 2018–19 బడ్జెట్లో రూ.175 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ రూ.175 కోట్లు కేటాయించారు. -
నిప్పుల కోలిమిలా మారిన తెలుగురాష్టాలు
-
మండుతున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోతున్నదని.. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండల్లో వెళ్లేటప్పుడు తగిన ముందుజాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయని, ఈ నెల 10వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని ఆర్టీజీఎస్ పేర్కొంది. కారంచేడులో 44, గుడ్లూరులో 42, పోలవరంలో 42.8, మొవ్వాలో 42.7, నెల్లూరులో 42.62, ఈపూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 201 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండని ఆర్టీజీసీ పేర్కొంది. -
ఏపీఎన్ఆర్టీకీ ఆర్టీజీఎస్ డేటా
మంగళగిరి (గుంటూరు) : రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన డేటా స్కాం బాగోతంలో రోజుకో అంశం వెలుగుచూస్తుండగా తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి సర్వే చేస్తూ పట్టుబడ్డ ఘటనలో మరో కోణం వెలుగుచూసింది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువకులకు ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో వారితోనూ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇందుకు మంగళగిరిలోని ఏపీఎన్ఆర్టీ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు అసోసియేషన్) కేంద్రంగా మారింది. ఈ పేరుతో మంగళగిరితోపాటు విజయవాడ చుట్టుపక్కల ఐటీ మంత్రి లోకేష్ అనుచరులు బినామీ పేర్లతో పలు ఐటీ సంస్థలు ఏర్పాటుచేశారు. వీటికి భారీగా సబ్సిడీలు, భూములు ధారాదత్తం చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొందరు యువకులను ఏపీఎన్ఆర్టీ సంస్థల్లో చేర్చి వారికి అక్కడ ఐటీ నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. ఇలా ఏపీఎన్ఆర్టీ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్న యువకుల్లో కొందరిని ఎంపికచేసి వారితో సర్వేకు నడుం బిగించారు. వీరిలో ఎక్కువగా ప్రకాశం, రాయలసీమ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలకు చెందిన యువకులున్నారు. వీరందరికీ ట్యాబ్‌లు, ఫోన్లు, వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చేసే బాధ్యతను కాంట్రాక్టు కింద లీడర్లకు అప్పగించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన డేటాను ఏపీఎన్ఆర్టీకి అప్పగించగా అక్కడ నుంచి లీడర్లకు నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా డేటాలున్న ట్యాబ్‌లు అందజేశారు. సర్వేలో ఓటరు ఫోన్ నంబర్, ఆధార్ కార్డు నంబర్ తీసుకోవడంతో పాటు ఓటరు ఏ పత్రిక చదువుతారు.. ఏ టీవీ చూస్తున్నారో సైతం సేకరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను గుర్తించి వారి ఫోన్, ఆధార్ నంబర్లను సేకరించి తద్వారా వారి బ్యాంకు అకౌంట్‌ను గుర్తిస్తున్నారు. వీరికి ఆన్లైన్లో నగదు జమచేసి ప్రలోభపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా, సర్వేలో సేకరించిన వివరాలను ట్యాబ్‌లో ఎంటర్ చేసిన వెంటనే ఆ వివరాలు మరో సర్వర్‌తో లింక్ అవుతాయి. లింక్ అయిన వివరాల ఆధారంగా గూగుల్ పే, ఫోన్‌పేల ద్వారా ఓటర్ల అకౌంట్లకు నగదు బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదంతా పక్కా ప్రణాళికతో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరుగుతోంది. ప్రభుత్వ, పోలీసుల అండదండలు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మంగళగిరి నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్న 10 మంది యువకులను పట్టుకుని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసులు మాత్రం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పోల్ ఒపీనియన్ తెలుసుకోవచ్చని, దానిని బహిర్గతం చేయకూడదని మాత్రమే నిబంధనలు ఉన్నాయంటున్నారు. వారిపై కేసు నమోదు చేయలేమని తేల్చిచెబుతున్నారు. సర్వే చేస్తున్న యువకులు సైతం పోలీసులతో ఎలాంటి ఇబ్బంది ఉండదని ధీమాగా ఉన్నారు. అంతేకాక, వీరికి ‘మేం చూసుకుంటాం’ అంటూ నిర్వాహకుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. కాగా, ఒపీనియన్ పోల్ అయితే ఓటరును ఏ పార్టీకి ఓటు వేస్తావని మాత్రమే తెలుసుకోవాల్సి వుండగా ఫోన్, ఆధార్ నంబర్లను సేకరించాల్సిన అవసరమేమిటనే దానిపై పోలీసులు నోరు విప్పడంలేదు. దీంతో ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు అప్పగించిన యువకులను బైండోవర్ చేసి వదిలేయడం గమనార్హం. పైగా తమ ట్యాబ్‌లు, సెల్ఫోన్లు తీసుకున్నారని వైఎస్సార్సీపీ నేతలపై ఎదురు ఫిర్యాదు చేయాలని స్వయంగా నార్త్‌జోన్ డీఎస్సీ ఆ యువకులకు సూచించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేది అనుమానమేనని పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పార్టీ కోసం ప్రభుత్వ సేవ
రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్‌లో ఉన్న సమాచారమంతా పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారమేనని ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారందరి సమాచారంతో పాటు ప్రభుత్వ సమాచారం, పౌరుల వ్యక్తిగత డేటాతో ఒక మొబైల్ యాప్‌ను ప్రైవేట్ సంస్థలతో తయారుచేయించి, ఆ తర్వాత దానిని తెలుగుదేశం పార్టీ సేవా మిత్రల ట్యాబ్‌లకు మళ్లించారని స్పష్టమైంది. ఇప్పుడు ఈ యాప్ గుట్టురట్టు చేసే ఓ వీడియో ఒకటి ‘సాక్షి’కి చిక్కింది. ప్రభుత్వం తయారుచేయించిన ఈ యాప్‌లో ఉన్న వివరాలు, సేవామిత్ర యాప్‌లో ఉన్న వివరాలు ఒక్కటేనన్నట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ యాప్‌లో వ్యక్తుల వారీగా కేటాయించిన కోడ్ నెంబర్లు, సేవామిత్రల్లో పేర్కొన్న వ్యక్తుల కోడ్ నెంబర్లు ఒకే రీతిన ఉన్నాయి. అయితే, ప్రభుత్వం తయారుచేసిన యాప్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైం గవర్ననెన్స్ (ఆర్టీజీఎస్) శాఖలో రూపొందించిన విషయాన్ని ఆ విభాగాధిపతిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు స్వయంగా వెల్లడించారు. ‘మీ భూమి’ వెబ్లాండ్లో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న రైతుల భూముల వివరాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను కూడా పొందుపరిచేలా ఓ మొబైల్ యాప్‌ను తయారుచేయమని చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని ఆయన అందులో బయటపెట్టేశారు. రైతుల భూముల వివరాలతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కూడిన యాప్‌పై అవగాహన కలిగించేందుకు 2018 జూన్ 21న జరిగిన ప్రభుత్వ సమావేశంలో అహ్మద్ బాబు ఆ యాప్ గురించి సీఎంతో పాటు ఐఏఎస్ ఉన్నతాధికారులకు వివరిస్తున్న వీడియో ‘సాక్షి’కి దొరికింది. అందులో యాప్‌కు సంబంధించిన అంశాలపై అహ్మద్ బాబు ఏం చెప్పారంటే.. – రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాల వివరాలను యాప్‌కు అనుసంధానం చేశారు. – ఒక్కో ఇల్లు ప్రాతిపదికన ఇంటి యజమాని పేరుతో ఆ కుటుంబంలో సభ్యులు ఎందరు.. వారి వివరాలు పొందుపరిచారు. – కుటుంబ సభ్యుల వారీగా ఒకొక్కరూ ఏఏ పథకాల ద్వారా లబ్ధిపొందారన్న వివరాలున్నాయి. – యాప్ తయారీకి ఆర్టీజీసీ ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు నెంబరు కేటాయించింది. ఆ నెంబరు క్లిక్ చేయగానే ఆ వ్యక్తి ఫొటో, ఆధార్, పేరు, అతని ఫోన్ నెంబరు, అతని ఆదాయం సహా అన్ని వివరాలు యాప్ ఉన్న మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. – వ్యవసాయ భూముల వివరాలు, ఉపాధి హామీ పథకంలో ఎవరెన్ని రోజులు పనిచేశారు.. ఇళ్లు మంజూరైన వారి వివరాలు.. చంద్రన్న పెళ్లి కానుక లబ్ధిదారులు.. రేషన్ సరుకులు తీసుకుంటున్న వారు, పసుపు–కుంకుమ కింద డబ్బులు పొందిన డ్వాక్రా మహిళల వివరాలు ఆ యాప్‌లో పొందుపరిచారు. – ప్రభుత్వం ఏర్పాటుచేసిన 1100 నెంబరుకు ఎవరైనా ఫోన్‌చేస్తే.. వారి వివరాలు అప్పటికప్పుడు యాప్‌కు చేరేలా అనుసంధానం చేశారు. ఇలా 2018 జూన్ నాటికి 61 లక్షల మంది వివరాలు యాప్‌కు అనుసంధానం చేసినట్టు అహ్మద్ బాబు ఆ వీడియోలో వివరించారు. – ఆ యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు. – ఈ యాప్‌లో నమోదు చేసే ప్రతి అంశం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరుతుంది. సాధికార మిత్రల కోసమంటూ టీడీపీ కార్యకర్తల ట్యాబ్‌లోకి.. వాస్తవానికి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం 2018 జూన్‌లో 4.80లక్షల డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి, వారికి సాధికార మిత్రలుగా నామకరణం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని మొత్తం 1.40కోట్ల కుటుంబాలకు వివరించేందుకు ఒక్కో సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించారు. ఈ యాప్‌తో సాధికార మిత్రలను ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకుంటే, 4.80 లక్షల మందిలో ఎవరో ఒకరి ద్వారా విషయం బయటకు పొక్కుతుందని సర్కారు పెద్దలు అనుమానించి ఆ తర్వాత ప్లాన్ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వారికి స్మార్ట్ ఫోన్ల కొనుగోలూ ఖర్చుతో కూడుకున్నదని భావించింది. దీంతో ఈ యాప్‌ను పూర్తిగా టీడీపీ బూత్ కమిటీ నేతల ట్యాబ్‌లకు మళ్లించారని అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ యాప్‌ను మొదట సాధికార మిత్రల కోసమని ప్రభుత్వం తయారుచేయించినట్లు అహ్మద్ బాబు సైతం ఆ వీడియోలో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఆర్టీజీఎస్ తయారుచేసిన యాప్‌లో లబ్ధిదారులకు ఇచ్చిన కోడ్ నెంబర్లు, టీడీపీ సేవా మిత్రలో ఉన్న కోడ్ నెంబర్లు ఒకే తీరులో ఉండడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల కుట్రను బట్టబయలు చేస్తోంది. -
ఎందుకూ కొరగాని ఆర్టీజీఎస్!
దేశంలో ఏ ముఖ్యమంత్రీ ప్రకటించుకోవడానికి సాహసించని ధోరణి ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్న డాంబిక ప్రచారానికి అడ్డూ ఆపూలేకుండా పోతోంది. అన్నీ తానే సాధించినట్లు, అభివృద్ధికి తానే బ్రాండ్ పేరు అన్నట్లుగా నిత్యం ప్రచార మోతలో మునుగుతున్న బాబు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే భావనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది తాను కనిపెట్టిన అద్భుత సాధనంగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం తప్ప ఉపయోగం లేదని ఏపీ ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం విని యోగించని టెక్నాలజీతో రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నానని చంద్రబాబు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నా ఆచరణలో మాత్రం గడప దాటడంలేదు. తన పాలన ప్రపంచానికే ఆదర్శమని, తాను చేసే అన్ని కార్యక్రమాలు చారిత్రాత్మకమని, గుప్తులకాలం స్వర్ణయుగమైతే ఇప్పటి తన హయాం అంతకు మించిపోయిందని చెబుతున్న అతిశయాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. రియల్‌టైమ్ గవర్నెన్స్, ఈ–ప్రగతి ప్రజలకు అంతుబట్టని మిథ్యగా మారిపోయింది. సుపరిపాలన పేరుతో ఆయన విడుదల చేసిన శ్వేతపత్రంలో అంతా భ్రాంతే తప్ప వాస్తవం అణుమాత్రమైనా గోచరించడంలేదు. అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని ప్రకటించుకున్నా నాలుగున్నరేళ్లలో జరిగిన అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్)ను తాను కనిపెట్టిన ఒక అద్భుత సాధనంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నా దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధానం వృధాయే తప్ప ఉపయోగం లేదని పలువురు సీనియర్ అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పరిష్కార వేదిక ఒక బోగస్ ‘ఆర్టీజీఎస్’ను ఒక ప్రభుత్వ శాఖగా ఏర్పాటుచేసి మిగిలిన శాఖలన్నింటిపైనా దానికి పెత్తనం ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ శాఖలు ఇచ్చే నివేదికలను ఆర్టీజీఎస్ నివేదికలతో పోల్చి సరిచూడడం వల్ల యంత్రాంగంలో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. మిగిలిన శాఖలన్నింటికీ సమాం తరంగా చంద్రబాబు ఆర్టీజీఎస్‌ని ప్రోత్సహిస్తుండడంతో ఆయా శాఖల స్వతంత్రత దెబ్బతింటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్టీజీఎస్‌లోనే పరిష్కార వేదిక పేరుతో 1100 కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి అందులో రెండు వేల మందికిపైగా ఆపరేటర్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. 2017 నవంబర్‌లో ఇది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,72,11,367 ఫిర్యాదులు రాగా అందులో 1,41,92,898 పరిష్కారమైనట్లు ప్రకటించారు. కానీ ఇదంతా బోగస్ అని అధికారవర్గాలే చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మచిలీపట్నం రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరితే ఆర్టీజీఎస్ దాన్ని గ్రామీణ నీటిసరఫరా విభాగానికి పంపింది. ఆ పిటీషన్ వివిధ దశల్లో తిరిగి చివరికి ప్రస్తుతం నిధుల్లేవు, ఉన్నప్పుడు రోడ్డు వేస్తామనే సమాధానంతో ముగిసింది. సంబంధిత అధికారి ఇదే విషయాన్ని ఆర్టీజీఎస్ సైట్లో అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీ సమస్య విజయవంతంగా పరిష్కారమైనట్లు పిటీషన్ పెట్టిన వ్యక్తికి మెసేజ్ వచ్చింది. ఇళ్ల నిర్మాణం, భూసమస్యల ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఇలాగే అధికారుల సమాధానంతోనే పరిష్కారమైనట్లు చూపిస్తున్నారు. విజయవాడలోని ఒక మాల్లో సినిమాకు వెళ్లిన కొందరు మిత్రులు అక్కడి కౌంటర్లలో తినుబండారాల ధరలు సాధారణ రేట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే కాల్‌సెంటర్ నమోదు చేసుకోవడానికే అరగంటకు పైగా విసిగించడంతో వారు వదిలేశారు. దీంతో పరి ష్కార వేదిక ఒక బోగస్ అనే అభిప్రాయం ఉద్యోగుల్లోనే స్పష్టంగా ఏర్పడిపోయింది. సంతృప్తి సర్వేలు సొంతానికి ఆర్టీజీఎస్ చేస్తున్న సంతృప్తి సర్వేలు ప్రభుత్వ పెద్దల అవసరానికే తప్ప ప్రజల కోసం కాదని స్పష్టమవుతోంది. రెండు వేల మందికి పైగా ఆపరేటర్లతో ఏర్పాటైన కాల్ సెంటర్ నుంచి ప్రతిరోజూ 15 లక్షల మందికి ఫోన్లు చేసి ప్రభుత్వ పథకాలపై సంతృప్తిగా ఉన్నారా, లేదా అని వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇవికాకుండా మరో 15 లక్షల ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ఈ సర్వేలు చేస్తున్నా అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే సాగుతున్నాయి. వీటి ఆధారంగానే ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ఇంత సంతృప్తి స్థాయి ఉందని, ఇంకా పెరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిజానికి ఈ సర్వేలను అధికారులే నమ్మడంలేదు. ముఖ్యమంత్రి వాయిస్‌తో వెళ్లే ఆర్టీజీఎస్ ఫోన్ కాల్స్‌ను 40 శాతం మందికిపైగా జనం తిరస్కరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కాల్ సెంటర్ ఫోన్‌రాగానే మెజారిటీ జనం కట్ చేస్తున్నట్లు ఆర్టీజీ వర్గాలే వాపోతున్నాయి. అంటే ఈ సర్వేలపై ప్రజల్లో నమ్మకం లేకపోగా విసుగుపుడుతోందని అర్థమవుతోంది. ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించే కైజలా యాప్స్‌ను అభివృద్ధి చేశామని మొదట్లో గొప్పలు చెప్పిన ఆర్టీజీఎస్ అది విఫలమవడంతో దాని ఊసే ఎత్తడంలేదు. ఆర్టీజీఎస్, ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సాంకేతికతపై నీతి ఆయోగ్ పెదవి విరిచింది. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉందని ప్రకటించుకున్నా అదే నీతి ఆయోగ్ ఏపీ ప్రభుత్వం చేస్తున్న సర్వేలు బూటకమని కొట్టిపారేసింది. తమకు తామే సర్వేలు చేసుకుని చంకలు గుద్దుకోవడం ఏమిటనే ప్రశ్నకు రాష్ట్రం నుంచి సమాధానం కరువైంది. తుఫాను హెచ్చరికల పాత్రతో కామెడీ వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలను జారీ చేసే ప్రక్రియను కూడా ఆర్టీజీఎస్ హైజాక్ చేసింది. ఇటీవల పెథాయ్ తుఫానును కచ్చితంగా అంచనా వేశామని ఇది తమ సమర్థతకు నిదర్శనమని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు కొద్దిరోజుల ముందు వచ్చిన తిత్లీ తుఫానునూ తాను నియంత్రించినట్లు చెప్పారు. చంద్రబాబు ఆయన పరివారం ఎంత హడావుడిగా తిరిగినా తిత్లీ తుఫాను వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ హడావుడి వల్ల సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడగా నష్టపరిహారం చెల్లింపులు సక్రమంగా జరగలేదు. పెథాయ్ తుఫాను బాధితులకు 25వ తేదీకల్లా పరిహారం అందిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా ఇంతవరకూ బాధితులకు సాయం అందలేదు. విపత్తులు వచ్చినప్పుడు వాటి గురించి హెచ్చరించే యంత్రాంగాలు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి. చంద్రబాబు మాత్రం వీటిని తాను కొత్తగా కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటూ తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం చెప్పే విషయాలను చెబుతూ కామెడీ చేస్తుండడం అధికారులను నివ్వెరపరుస్తోంది. పిడుగులు ఎక్కడ పడతాయో ముందే చెబుతామంటూ హడావుడి చేసి కొద్దిరోజులు షో చేసినా పిడుగుపాటు మరణాలను ఆపలేకపోయారు. తాను కనిపెట్టిన టెక్నాలజీతో తుఫానుల వల్ల పంటలు దెబ్బతినకుండా కాపాడానని, రైతులను హెచ్చరించానని, మత్స్యకారులను కాపాడానని చెబుతున్నా అవన్నీ ఉత్తిదే అని పలుసార్లు స్పష్టమైంది. ఇటీవల పెథాయ్ తుఫాను సందర్భంగా కాకినాడ తీరంలో మత్స్యకారుల పడవ గల్లంతైంది. ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తే వారి బోటు ఎందుకు తుఫానులో చిక్కుకుందనే దానికి ఆర్టీజీఎస్ నుంచి సమాధానం కరువైంది. ప్రజలకు దూరంగా మీ–సేవ మీ–సేవ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందిస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం కనిపించడంలేదు. 37 శాఖలకు చెందిన 196 ప్రభుత్వ సేవలను మీ–సేవ పరిధిలోకి తెచ్చినా అందులో ప్రజలకు అందుబాటులో ఉన్నవి పదిలోపే. ఈ సేవలను వినియోగించుకుందామని వెళ్లిన జనానికి సర్వర్ల డౌన్ అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. సర్వర్ల సమస్యతోనే మీ–సేవ చాలా వరకూ విఫలమైంది. వాటి సంఖ్యను 3,506 నుంచి 11835కి పెంచినా సర్వర్ల సమస్యకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ–ప్రగతి పేరుతో 76 సర్వీసులను కంప్యూటరీకరించినా వాటివల్ల ఉపయోగంలేదు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో భూదార్‌ను ప్రవేశపెట్టినా ప్రజలు ఇంకా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఆన్లైన్లోనే అంతా జరిగిపోతుందని ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి చాలాతేడా కనిపిస్తోంది. ఈ–ప్రగతి ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. గతం నుంచి ఉన్న సౌకర్యాలే తప్ప కొత్తగా ఇ–ప్రగతి ద్వారా సాధిం చింది పెద్దగా ఏమీ లేదని చెబుతున్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం బెల్టు షాపులు రద్దు చేసే ఫైలుపై సంతకం చేసినా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బెల్టు షాపుల్ని మొత్తం నిర్మూలించామని, సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ప్రకటించినా అదంతా అవాస్తవమనేది బహిరంగ రహస్యం. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించింది. చంద్రబాబు అధికారంలోకొచ్చే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల వరకు బెల్టు షాపులుంటే, ఇప్పుడు ఈ సంఖ్య 60 వేలకు చేరిందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఏడాదికి మద్యం, బీరు అమ్మకాలు మొత్తం కలిపి రూ.17,291 కోట్ల మేర జరుగుతున్నాయి. ఇందులో బెల్టు దుకాణాల వ్యాపారం రూ.9 వేల కోట్లకు పైగా అంటే సగంకు పైగా మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారానే జరుగుతోంది. పుష్కరాల్లో ప్రచార యావ.. 29 మంది మృత్యువాత చంద్రబాబు ప్రచార యావతో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు గోదాట్లో కలిసిపోయాయి. దీనిపై వేసిన సోమయాజులు కమిషన్ మూడేళ్ల తర్వాత ఇచ్చిన నివేదికలో వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసింది. కృష్ణా నదిలో 2017 నవంబర్‌లో జరిగిన పడవ బోల్తా ఘటనలో ఏకంగా 22 మంది ప్రాణాలు నీటిపాలయ్యాయి. విశాఖ మన్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే, టీడీపీ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడంలో భద్రతా వైఫల్యం, నిఘా నీరుగారిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. నిజాయితీగా విధులు నిర్వర్తించిన మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడిచేíసినప్పటికీ ఆమెకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పక్షపాతం చూపింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడటంతోపాటు ఆయన గన్‌మెన్‌పై దౌర్జన్యం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయకపోగా కనీసం క్రమశిక్షణ చర్యలు లేవు. శాంతిభద్రతల అదుపులో ఘోర వైఫల్యం రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా చోటుచేసుకున్న అనేక ఘటనలు శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, ఆర్థిక నేరాల సంఖ్య పెరిగిపోయింది. జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై రాష్ట్రంలో 2016లో 16,362 నేరాలు జరగ్గా 2015లో 15,967 నేరాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 4.9 శాతంతో 8వ స్థానంలో ఉంది. మహిళల అక్రమ రవాణాలోను రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో ఐదు, ఎస్టీలపై నేరాల్లో నాలుగు, ఆర్థిక నేరాల్లో పది, సైబర్ నేరాల్లో ఆరవ స్థానంలో ఉంది. మొత్తం నేరాలన్నింటిలో ఏపీ 13వ స్థానంలో ఉంది. రాష్ట్రమంతటా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను మట్టుపెట్టడం, వారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న చెరుకులపాడు నారాయణరెడ్డిని 2017 మే నెలలో పెళ్లికి వెళ్లి వస్తుండగా కాపుకాసిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి్డపై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ పోలీసులు నీరుగార్చారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఈ ఏడాది అక్టోబర్ 23న కత్తితో హత్యాయత్నం చేసిన ఘటనలో పోలీసులు, ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కుట్ర కోణం వైపు దృష్టి పెట్టకుండా నిందితుడు శ్రీనివాసరావు చుట్టూనే దర్యాప్తును పరిమితం చేయడం అనుమానాలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితైంది. ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26న విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల నిరసనకు సంఘీభావంగా వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని విమానాశ్రయం రన్‌వే పైనే అడ్డుకున్న పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అమరావతిలో 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకెళ్లి నిర్బందించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఇంటి నుంచి బయటకు రాకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, తదితర పలువురు నేతలతోపాటు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలను పలుమార్లు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే అక్కడ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, బాధితుల ముందస్తు అరెస్టులు, కేసులను పరిపాటిగా మార్చేశారు. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా జరిగిన తుని సభ హింసాత్మకంగా మారి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, పోలీస్ స్టేషన్లు దగ్ధమైన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైకి నెట్టి అపఖ్యాతిపాల్జేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం అభాసుపాలైంది. రాజధాని అమరావతిలో భూ సమీకరణకు తమ భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలు జాతీయ మానవ హక్కుల నేతలను సైతం విస్మయానికి గురిచేశాయి. తమ మాట వినని రైతుల అరటితోటలు, తాటాకు పాకలు తగలబెట్టించిన కొందరు సంఘ విద్రోహశక్తులు భయాందోళనలు సృష్టించారు. తుందుర్రు, గరగపర్రు, దివీ స్లలో శాంతిభద్రతలను అదుపుచేయలేక ప్రభుత్వం ప్రజలను ఇబ్బం దులకు గురిచేసింది. -బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి -
పెథాయ్ తుపాను బీభత్సం
-
ప్రజలు తస్మాత్ జాగ్రత్త: ఆర్టీజీఎస్ హెచ్చరికలు
సాక్షి, అమరావతి : పెథాయ్ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుపాను తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోందని, గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను ఈరోపు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో పెథాయ్ తీరం దాటనుందని తెలిపింది. తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడుతుందని తెలిపింది. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, అరటి రైతులు, ఉద్యానవన రైతులు తగు జాగ్రత్తల్లో ఉండాలని హెచ్చరించింది. వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని సూచించింది. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భద్రపరచాలని, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు టార్పాలిన్ పట్టలను పొందవచ్చునని తెలిపింది. గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న వారిని పునరావాస కేంద్రాలకు, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలని సూచించింది. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, రోడ్లపై వాహనాల్లో తిరగరాదు.. చెట్ల కింద తలదాచుకోరాదని.. తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
సాక్షి, అమరావతి : తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) తెలిపింది. తుఫాను శ్రీహరికోటకు 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయని పేర్కొంది. 17వ తేదీ సాయంత్రానికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్న తుఫాను గమనాన్ని ఆర్టీజీఎస్ నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆర్టీజీఎస్లో తుఫాను పరిస్థితులను ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ నుంచి తుఫాను జాగ్రత్తల సందేశాలు జారీ అవుతున్నాయి. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మత్స్యకారుల పడవలు తీరంలోనే నిలిచిపోయాయి. తుఫాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్లో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు జిల్లాలో తుఫాను ప్రభావం గుంటూరు : జిల్లాలో పెథాయ్ తుఫాను ప్రభావం కన్పిస్తోంది. తీర ప్రాంతాల్లో గాలుల ఉధృతి పెరిగింది. బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్రం ఇరవై అడుగుల ముందుకు వచ్చింది. సముద్రంలో అలల ఉధృతి సైతం పెరిగింది. బీచ్‌లోకి పర్యాటకులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. -
కోస్తా జిల్లా ప్రజలకు హెచ్చరిక
అమరావతి: కోస్తా జిల్లా ప్రజలకు ఏపీకి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. రేపు(సోమవారం) సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశముందని పేర్కొంది. గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, ప్రజలు కూడా సముద్ర తీరం వైపు వెళ్లకుండా ఉండాలని పలు సూచనలు చేసింది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఉత్తర చత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఈరోజు అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఈరోజు, రేపు కోస్తా ఆంధ్రలో చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లుండి కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంది. ఉత్తరాంధ్రకు అల్పపీడన తీవ్రత ఉత్తరాంధ్ర జిల్లాలకు అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు కొన్ని సూచనలను వారు విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 17 వరకు తీవ్ర ప్రభావం ఉండనుందని, తీర ప్రాంతాల్లో అలల తీవ్రత ఎక్కవగా ఉండే అవకాశం ఉందని అన్నారు. అలలు 4 మీటర్ల ఎత్తువరకు ఎగసి పడొచ్చని తెలిపారు. గాలుల వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అన్నారు. తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభావిత మండలాలు : విశాఖపట్నం : రాంబిల్లి, పెదగంట్యాడ, పరవాడ, అచుతాపురం, విశాఖపట్నం, విశాఖపట్నం రూరల్, భీమునిపట్నం. విజయనగరం : భోగాపురం, పూసపాటిరేగ. శ్రీకాకుళం : రణస్థలం, ఈతచెర్ల, శ్రీకాకుళం, గార, పొలాకి, సంతబొమ్మాళి, పాల్స, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం -
ఆర్టీజీఎస్... అంతా తుస్
-
డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులు
► రైతులు, కూలీలకు చెల్లించేందుకు చర్యలు ►ఆర్టీజీఎస్ ద్వారా పత్తి కొనుగోళ్ల చెల్లింపులు ► కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్ అధికారులతో సమావేశం ఆదిలాబాద్ అర్బన్ : నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రైతులు, కూ లీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జ్యో తిబుద్ధప్రకాశ్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. రూ. 500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో రైతులు, కూలీ లు ఎలాం టి ఇబ్బందులు పడొద్దని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు లు, కూలీలు, సామాన్య ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బం దులను తొలగించేందుకు కేంద్ర ప్రభు త్వ నిబంధనల మేరకు అన్ని బ్యాంకు లు, మార్కెట్లు, వ్యాపారుల వద్ద డిజి టల్ పద్ధతి ద్వారా నగదు చెల్లింపుల సౌ కర్యాలు కల్పించాలని సూచించారు. సౌ కర్యాల కల్పించడంతోపాటు వారికి అవగాహన కల్పించే బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. బ్యాంకు ఖాతా లు లేని రైతులు, కూలీలు వెంటనే బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ విధా నం ద్వారా అవగాహన పొంది నగదు లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ పొందాలని కోరా రు. పత్తి రైతులకు ఆర్టీజీఎస్ ద్వారా పత్తి కొనుగోళ్ల చెల్లింపులు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. అ నంతరం వివిధ బ్యాంకు అధికారులు మాట్లాడుతూ బ్యాంకుల్లో సరిపడా డ బ్బు అందడం లేదన్నారు. రోజురోజుకు కేంద్ర ప్రభుత్వం నగదు విత్‌డ్రావల్స్ పరిమితి పెంచుతోందని, బ్యాంకుల్లో డబ్బు నిల్వలు లేనందున ప్రజల డి మాండ్ మేరకు నగదు లావాదేవీలు కొ నసాగించలేకపోతున్నామని పేర్కొన్నా రు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్, ఎల్డీఎం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
ధన ప్రవాహానికి అడ్డుకట్ట!
న్యూఢిల్లీ: ఎన్నికలలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) పది సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ప్రణాళిక అమలుకు సంబంధించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈసీ ప్రతిపాదనల ప్రకారం... పార్టీ అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పద్దులను, చిట్టాలను పార్టీ కోశాధికారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీకి అందే విరాళాలు లేదా నిధులను సహేతుకమైన సమయంలోగా గుర్తింపు పొందిన బ్యాంకులోని ఖాతాలో జమ చేయాలి. పార్టీ సభలు, ఎన్నికల ప్రచారం ఖర్చుల నిమిత్తం ఏకమొత్తంలో నిధులు ఇవ్వదలస్తే, ఆ మొత్తాన్ని చెక్ (ఖాతా ద్వారా చెల్లింపు), డ్రాఫ్ట్, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లేదా ఇంటర్నెట్ బదిలీ ద్వారా మాత్రమే చెల్లించాలి. నిర్దేశించిన మొత్తం కన్నా ఎక్కువగా అభ్యర్థి కానీ, కార్యకర్తలు కానీ తమ వెంట తీసుకెళ్లకుండా ఆయా రాజకీయ పార్టీలే చూసుకోవాలి.