
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోతున్నదని.. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండల్లో వెళ్లేటప్పుడు తగిన ముందుజాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఐదు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయని, ఈ నెల 10వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని ఆర్టీజీఎస్ పేర్కొంది.
కారంచేడులో 44, గుడ్లూరులో 42, పోలవరంలో 42.8, మొవ్వాలో 42.7, నెల్లూరులో 42.62, ఈపూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 201 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండని ఆర్టీజీసీ పేర్కొంది.