RTGS charges
-
ఆర్టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ అమలుపరిచింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1–5 వరకు, ఆర్టీజీఎస్‌పై రూ.5–50 వరకు చార్జ్ చేస్తోంది. డిజిటల్ రూపంలో నిధుల బదిలీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ పేర్కొంది. వాస్తవానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై చార్జీలను ఎత్తివేయడమే కాకుండా, రోజులో 24 గంటల పాటు ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషిన్లపై సుంకాలు ఎత్తివేయాలని, ఇలా ఎన్నో సూచనీలను నీలేకని కమిటీ సిఫారసు చేసింది. కానీ, ఇతర అంశాలపై ఆర్బీఐ స్పందించినట్టు లేదు. ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకుసంచలన నిర్ణయం: చార్జీలు రద్దు
సాక్షి,ముంబై: ప్రయివేటు దిగ్గజం హెచ్డీఎఫ్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఆర్ధికవ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ఉచిత ఆన్లైన్ లావేదేవీలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్‌కు ఊతమిస్తూ వినియోగదారులు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు రద్దు చేసింది. అలాగే చెక్ బుక్ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరించింది. ఈ మేరకు కస్టమర్లకు సమాచారాన్ని అందించింది. బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్ (RTGS) , నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) సేవలను ఉచితంగా అందించనుంది. ఈ ఆదేశాలు నవంబర్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టుతెలిపింది. తద్వారా వినియోగదారులు జరిపే లావాదేవీలపై చార్జీలు వసూలు చేయబోమని సోమవారం ప్రకటించింది. సేవింగ్, సాలరీ ఖాతాలతోపాటు, ఇతర రీటైల్ కస్టమర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయిని బ్యాంక్ వినియోగదారులకు అందజేసిన నోటీసులో తెలిపింది. మరోవైపు చెక్‌ఆధారిత లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపింది. చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ ఛార్జీలను, డిసెంబర్ 1, 2017 ను అమలు చేస్తామని తెలిపింది. చెక్ రిటర్న్‌కు రూ. 500 లు జరిమానా విధిస్తుంది. డిపాజిట్ చేసిన చెక్కులకు చెల్లించని సందర్భాల్లో పెనాల్టీని రూ. 100నుంచి రూ. 200 కు పెంచింది. దీంతోపాటు ఇకమీదట సం.రానికి ఒకచెక్‌బుక్ (25 లీఫ్స్) మాత్రమే ఉచితంగా అందిస్తుంది. ఇప్పటివరకు రెండు ఇచ్చేది. అయితే అదనపు చెక్‌బుక్ కోసం వసూలు చేసే చార్జిని రూ.75గానే ఉంచింది. సమర్థవంతంగా అమలు చేయని రెసిడెంట్ సేవింగ్స్ , సాలరీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా గతంలో రెండు లక్షల లోపు ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.25, 2-5 లక్షలపై రూ.50 వసూలు చేస్తుండగా, నెఫ్ట్ లావాదేవీలపై పది వేల లోపు అయితే రూ.2.50, లక్ష లావాదేవాపై రూ. 5, ఆపైన నిర్వహించే లావాదేవీలపై రూ.15 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
నేటి నుంచే ఎస్బీఐ కొత్త ఛార్జీలు
ముంబై : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల తగ్గించిన నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలు నేటి(జూలై15) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తగ్గింపుతో ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్ సర్వీసులు 75 శాతం తక్కువకు లభ్యమవుతున్నాయి. డిజిటల్ పెమంట్ల వృద్ధి చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఎస్బీఐ ఈ ఛార్జీల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే లావాదేవీలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తోంది. అలాగే బ్యాంక్.. ఐఎంపీఎస్ ద్వారా జరిపే ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై (రూ.1,000 వరకు) చార్జీలను రద్దు చేసింది. ఎస్బీఐ తగ్గించిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి... నెఫ్ట్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు (రూ.10,000 వరకు) రూ.1కి, (రూ.1 లక్ష వరకు) రూ.2కు తగ్గాయి. అంతకముందు ఈ ఛార్జీలు రెండు రూపాయలు, నాలుగు రూపాయలుగా ఉన్నాయి. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు 12 రూపాయల నుంచి 3 రూపాయలకి దిగివచ్చాయి. ఇక రూ.2 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు రూ.5గా ఉన్నాయి. ఈ చార్జీలు కూడా ముందు రూ.20గా ఉన్న విషయం విదితమే. ఆర్టీజీఎస్ విధానంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు 20 రూపాయల నుంచి 5 రూపాయలకు దిగివచ్చాయి. ఇక రూ.5 లక్షలకుపైన ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే రూ.10 చార్జీ పడుతోంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.40గా ఉన్నాయి. కొత్తగా సవరించిన అన్ని చార్జీలకు జీఎస్టీ రేటు 18% వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ శాఖల్లో ఎగ్జిక్యూటివ్స్ ద్వారా జరిపే ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌పై చార్జీలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఇక మార్చి చివరి నాటికి ఎస్బీఐకి 3.27 కోట్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు, 2 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు.