
తమ యూజర్లను ఇతర నెట్‌వర్క్‌వైపు మళ్లకుండా ప్రముఖ టెలికాం కంపెనీలు యూజర్లకు తరుచుగా కొత్త మొబైల్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ప్లాన్‌లో భాగంగా ప్రముఖ ఓటీటీ సేవలను కూడా యూజర్లకు ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ ఐడియా(వీఐ) తన పోస్ట్‌పెయిడ్ యూజర్లకు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీఐ రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ల పేరిట రెండు కొత్త పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీఐ రెడ్‌ఎక్స్ ప్లాన్‌లో భాగంగా రూ.1699, రూ.2299 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లకు ఉచితంగా ఓటీటీ కనెక్షన్లను అందిస్తుంది.
వీఐ రూ. 1699 రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్
వీఐ రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ రూ. 1699 ఒక నెల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ముగ్గురు సభ్యులు వాడుకోవచ్చును పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్ కాల్‌లు ఉంటాయి. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3,000 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చును. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ,డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్లను ఒక ఏడాదిపాటు పొందవచ్చును.
వీఐ రూ. 2299 రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్:
వీఐ రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ రూ. 2299 ఒక నెల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ఐదుగురు సభ్యులు వాడుకోవచ్చును పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, జాతీయ రోమింగ్ కాల్‌లు ఉంటాయి. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3,000 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చును. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ,డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్లను ఒక ఏడాదిపాటు పొందవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment