డెహ్రాడూన్: సినిమా నిర్మాతలు, దర్శకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ఉత్తరాఖండ్‌లో ఉచితంగా సినిమా షూటింగ్‌లు జరుపుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. సినిమా షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌ను కేంద్రస్థానంగా మార్చడంలో భాగంగా చిత్రీకరణ ఫీజును రద్దుచేశామన్నారు. తెహ్రీ పట్టణంలో శుక్రవారం షాహీద్ కపూర్ నటిస్తున్న ‘బిజ్లీ గుల్ మీటర్ చాలూ’ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి రావత్ క్లాప్ కొట్టారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఉత్తరాఖండ్ సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన చోటని రావత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment