పలు దిగ్గజ టెలికాం సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకుగాను బండిల్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్స్‌తో పలు ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. కాగా ఆయా టెలికాం సంస్థలు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులపై కూడా ఆయా ఓటీటీ సేవలను కస్టమర్లు ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవెడర్లలో చౌవకైన, సూపర్ ప్లాన్స్‌ను జియో ఫైబర్ అందిస్తోంది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో ఆయా ఓటీటీ సేవలను కస్టమర్లకు ఉచితంగా అందజేస్తోంది. జియో ఫైబర్ అందిస్తోన్న ఆయా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం...!
ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న జియో ఫైబర్ ప్లాన్స్ ఇవే..!
జియో ఫైబర్ రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: తక్కువ ధరకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోన్న ప్లాన్ ఇదే. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు 150Mbps వరకు డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంతో నిజమైన అపరిమిత ఇంటర్నెట్ డేటాతో రానుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ LIV, Zee5, Alt బాలాజీతో సహా 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ చేయవచ్చును. ఈ సేవలను ఏడాది పాటు పొందవచ్చును. దీనిలో నెట్‌ఫ్లిక్స్ సేవలను పొందలేరు. జియో ఫైబర్ రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు.
జియో ఫైబర్ రూ. 1499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఎక్కువ మేర జియో ఫైబర్ కస్టమర్లు ప్లాన్‌ను వాడుతున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా 300 Mbps వరకు డౌన్‌లోడ్ , అప్‌లోడ్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను పొందవచ్చును. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటుగా, అదనపు ఖర్చు లేకుండా 15 ఓటీటీ యాప్ సేవలను ఉచితంగా పొందవచ్చును. వీటిలో నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5 వంటివి అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ తప్ప మిగతా సేవలను ఏడాది పాటు పొందవచ్చును. జియో ఫైబర్ రూ. 1,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు.
జియోఫైబర్ రూ. 2499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 500 Mbps వేగం, 30 రోజుల చెల్లుబాటుతో అపరిమిత డేటాకు యాక్సెస్ చేయవచ్చును. జియో యాప్స్‌తో పాటుగా, ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, HoiChoi, Universal+, Lionsgate Play, JioCinema, ShemarooMe, Eros Now, Alt Balaji, జియోసవన్ సేవలను ఉచితంగా పొందవచ్చును.
జియో ఫైబర్ రూ. 3999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 1Gbps వేగం, 30 రోజుల చెల్లుబాటుతో అపరిమిత డేటాను యాక్సెస్‌ను చేయవచ్చును. జియో యాప్స్‌తో పాటుగా, ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, HoiChoi, Universal+, Lionsgate Play, JioCinema, ShemarooMe, Eros Now, Alt Balaji, జియోసవన్ సేవలను ఉచితంగా పొందవచ్చును.
జియో ఫైబర్ రూ. 8999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 1Gbps వేగం, 30 రోజుల చెల్లుబాటుతో 6600GB డేటాకు యాక్సెస్ లభిస్తోంది. జియో యాప్స్‌తో పాటుగా, ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, HoiChoi, Universal+, Lionsgate Play, JioCinema, ShemarooMe, Eros Now, Alt Balaji, జియోసవన్ సేవలను ఉచితంగా పొందవచ్చును.
చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
Comments
Please login to add a commentAdd a comment