
ఎయిర్ టెల్ 'జాక్ పాట్' 5 జీబీ డాటా ఫ్రీ
న్యూఢిల్లీ: జియో ఆవిష్కరణ తర్వాత భారత టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బిలియనీర్ ముకేష్ అంబానీ ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్ ఆఫర్ల నేపథ్యంలో డాటా టారిఫ్ లో ప్రధాన టెలికాం ఆపరేటర్ల ఆఫర్ల వరద కురుస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ మరో బంపర ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ చందాదారులకోసం ఎయిర్ టెల్ 5 జీబీ ఇంటర్నెట్ డాటా ఉచితంగా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ను పొందటానికి యూజర్లు కొన్ని ముఖ్యమైన సూత్రాలను , నిబంధనలను గమనించాల్సి ఉందని ఎయిర్ టెల్ ప్రకటించింది.
ప్రధానంగా http://www.airtel.in/free?icid=home_jackpot_row_4_column_1 లింక్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం 'జాక్ పాట్' అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. దేశంలోని ఎయిర్ టెల్ ఖాతాదారులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అర్హులు. ఈ ఫ్రీ డాటా ఆఫర్ ను రాత్రి 12 గం.లనుంచి ఉదయం 6గం.లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అతని / ఆమె ఇప్పటికే వాడుతున్న డేటా ప్యాక్ ఆధారంగా ఈ డేటా వేగం వుంటుంది. ఈ పరిమితి దాటిన గంటల తరువాత వినియోగానికి డ్యాటా ప్యాక్ నుంచి చార్జ్ చేయబడుతుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది. అలాగే ఈ సదుపాయాన్ని 28 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రీ పెయిడ్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో వున్న నైట్ టైం వినియోగానికిగాను 50శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జోడించడం కుదరదు. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా 300ఎంబీ రాత్రి డేటా ఆఫర్, వింక్ సంగీతం, వింక్ గేమ్స్, వింక్ సినిమాల ప్యాక్ కంబైన్డ్ కాదు. ఈ ఫ్రీ డాటా ఆఫర్ కోసం ఇప్పటికే వాడుతున్న అదే ఎయిర్ టెల్ మొబైల్ నెంబరుతో మాత్రమే రిజస్టర్ కావాలి. ఆఫర్ జాబితా ప్రతినెల చివరలో రిఫ్రెష్ చేయబడుతుంది.