బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత కాల్స్..
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు తమ ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి సోమవారం (ఆగస్ట్ 15) కూడా అన్ని రకాల మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లకు ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అనంతరం ఈ అవకాశం ప్రతీ ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందని టెలికం శాఖ మంత్రి మనోజ్‌సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోపు ఏ నెట్‌వర్క్‌కు అయినా ల్యాండ్‌లైన్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ కల్పిస్తున్న విషయం తెలిసిందే.
కొత్త ల్యాండ్‌లైన్ కస్టమర్లకు మొదటి ఆరు నెలల పాటు నెలవారీ అద్దె రూ.49 మాత్రమే వసూలు చేస్తున్నామని, అనంతరం రూ.99 నుంచి అందుబాటులో ఉన్న ఇతర ప్లాన్లలో ఒకదానికి మారవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.