విద్యార్థులకు పుస్తకాల పంపిణీ | BOOKS FREE DISTRIBUTION | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Published Wed, Jul 20 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

BOOKS FREE DISTRIBUTION

 
కాగజ్‌నగర్‌ : విద్యార్థులు కష్టబడి చదవాలని, మంచి మార్కులు సాధించాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్‌ కాలనీలోని ఇక్బాల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలు అందజేశారు.
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాల సహాయం అందిస్తామని, విద్యార్థులు పట్టుదలతో చదివి ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ విద్యార్థులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు.
      గతంలో ఇక్బాల్‌ స్కూల్‌కు నూతన భవనం మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగిందని, అయితే త్వరలోనే మిగిలిన తరగతి గదులను కూడా నిర్మించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత విద్యార్థులు విద్యలో రాణించి టాపర్లుగా నిలిస్తే తనకు ఎంతగానో సంతోషం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్‌ నియాజుద్దీన్‌ బాబా, టీఆర్‌ఎస్‌ నాయకులు దినేష్‌ అసోపా, స్కూల్‌ కరస్పాండెంట్‌ ముక్తియార్‌ అహ్మద్‌ రూమి, వైస్‌ ప్రసిడెంట్‌ ఇమాముద్దీన్‌ హబీబ్, కోశాధికారి ఫెరోజ్‌ ఖాన్, సభ్యులు జాకీర్, హెడ్‌ మాస్టర్‌ రజీయా జహా, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement