
సాక్షి, డెహ్రాడూన్ : కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1న ఉత్తరాఖండ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని ప్రతి నాలుగురోడ్ల కూడలిలో..ఉచిత వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సంబరాల సందర్భంగా మహిళలకు ఇబ్బంది కలగకుండా ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా తాగుబోతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.