Jio Fiber Postpaid Plans: Starts At 399Rs, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్‌ లేకుండానే..

Published Tue, Jun 15 2021 10:53 PM | Last Updated on Wed, Jun 16 2021 11:13 AM

JioFiber Postpaid Launched - Sakshi

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ ధరల్లో విప్లవత్మాక మార్పులు తీసుకువచ్చిన జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫైబర్ పోస్ట్‌ పెయిడ్‌ సేవలను జూన్‌ 17వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే జియో ఫైబర్‌ ప్రీ పెయిడ్‌ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండా ఇంటర్నెట్‌ బాక్స్‌ను అందించనుంది.

అంతేకాకుండా జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వర్తించనున్నాయి. జియో ఫైబర్ ప్రీ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకోవడానికి కచ్చితంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలి. జియో పోస్ట్‌ పెయిడ్‌లో రూ.399 నుంచి టారిఫ్‌ ఫ్లాన్‌లు ప్రారంభం కానున్నాయి. ఆటో పేమెంట్‌ ఆప్షన్‌తో వినియోగదారులకు మరింత సులువు కానుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు రూ.1000 రిటర్నబుల్‌ సెక్యూరిటి డిపాజిట్‌తో 4K సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చును. నెలకు రూ.999 ప్లాన్‌తో 15 ఓటీటీ యాప్స్‌ను అందిస్తుంది.

చదవండి: జియో నుంచి అన్‌లిమిడెట్‌ డేటా ప్లాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement