Post - Paid
-
జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే..
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ధరల్లో విప్లవత్మాక మార్పులు తీసుకువచ్చిన జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ సేవలను జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే జియో ఫైబర్ ప్రీ పెయిడ్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఇంటర్నెట్ బాక్స్‌ను అందించనుంది. అంతేకాకుండా జీరో ఇన్స్టాలేషన్ ఛార్జీలు వర్తించనున్నాయి. జియో ఫైబర్ ప్రీ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకోవడానికి కచ్చితంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. జియో పోస్ట్ పెయిడ్‌లో రూ.399 నుంచి టారిఫ్ ఫ్లాన్లు ప్రారంభం కానున్నాయి. ఆటో పేమెంట్ ఆప్షన్‌తో వినియోగదారులకు మరింత సులువు కానుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు రూ.1000 రిటర్నబుల్ సెక్యూరిటి డిపాజిట్‌తో 4K సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చును. నెలకు రూ.999 ప్లాన్‌తో 15 ఓటీటీ యాప్స్‌ను అందిస్తుంది. చదవండి: జియో నుంచి అన్లిమిడెట్ డేటా ప్లాన్స్ -
ఐడియా మంత్లీ రెంటల్స్ పెరిగాయ్
ముంబై: ఐడియా సెల్యులర్ కంపెనీ పోస్ట్-పెయిడ్ వినియోగదారుల నెలవారీ అద్దెలను రూ.50 పెంచింది. జూన్ బిల్ సైకిల్ నుంచి ఇది వర్తిస్తుందని కంపెనీ సర్వీస్ డెలివరీ హెడ్(ముంబై సర్కిల్) అమిత్ దిమ్రి పేర్కొన్నారు. కాగా ఐడియాకు ఉన్న మొత్తం 13.79 కోట్ల మంది వినియోగదారుల్లో పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల సంఖ్య 4 శాతంగా ఉంది. టారిఫ్, కాల్ రేట్లు, రెంటల్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశిశంకర్ చెప్పారు. అయితే ఈ రెంటల్స్ పెంపు ముంబై సర్కిల్కేనా, లేక దేశవ్యాప్తంగా ఉన్న 22 సర్కిళ్లకు వర్తిస్తుందా అన్న విషయంలో ఆయన స్పష్టతనివ్వలేదు. తీవ్రమైన పోటీ కారణంగా టెలికం కంపెనీలు గతంలో టారిఫ్‌లను తగ్గించక తప్పలేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ కాల్ రేట్లు ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఒక దశలో కాల్ రేట్లు అర పైసకు తగ్గాయి. అయితే స్పెక్ట్రమ్ ధరలు పెరగడంతో కాల్ రేట్లను పెంచక తప్పడం లేదని టెలికం కంపెనీలు అంటున్నాయి. నిధుల కొరతతో అల్లాడుతున్న టెలికం కం పెనీలు మెల్లమెల్లగా టారిఫ్‌లను పెంచుతున్నాయి.