ముంబై: ఐడియా సెల్యులర్ కంపెనీ పోస్ట్-పెయిడ్ వినియోగదారుల నెలవారీ అద్దెలను రూ.50 పెంచింది. జూన్ బిల్ సైకిల్ నుంచి ఇది వర్తిస్తుందని కంపెనీ సర్వీస్ డెలివరీ హెడ్(ముంబై సర్కిల్) అమిత్ దిమ్రి పేర్కొన్నారు. కాగా ఐడియాకు ఉన్న మొత్తం 13.79 కోట్ల మంది వినియోగదారుల్లో పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల సంఖ్య 4 శాతంగా ఉంది. టారిఫ్, కాల్ రేట్లు, రెంటల్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశిశంకర్ చెప్పారు.
అయితే ఈ రెంటల్స్ పెంపు ముంబై సర్కిల్‌కేనా, లేక దేశవ్యాప్తంగా ఉన్న 22 సర్కిళ్లకు వర్తిస్తుందా అన్న విషయంలో ఆయన స్పష్టతనివ్వలేదు. తీవ్రమైన పోటీ కారణంగా టెలికం కంపెనీలు గతంలో టారిఫ్‌లను తగ్గించక తప్పలేదు. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ కాల్ రేట్లు ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఒక దశలో కాల్ రేట్లు అర పైసకు తగ్గాయి. అయితే స్పెక్ట్రమ్ ధరలు పెరగడంతో కాల్ రేట్లను పెంచక తప్పడం లేదని టెలికం కంపెనీలు అంటున్నాయి. నిధుల కొరతతో అల్లాడుతున్న టెలికం కం పెనీలు మెల్లమెల్లగా టారిఫ్‌లను పెంచుతున్నాయి.
ఐడియా మంత్లీ రెంటల్స్ పెరిగాయ్
Published Mon, Jun 2 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement