
సాక్షి, చెన్నై: చేపలు కొంటే లీటరు పెట్రోల్ ఉచితం అంటూ మదురైలో ఓ వ్యాపారి చేసిన ప్రకటనతో జనం క్యూ కట్టారు. మదురై బీబీ కులంలో అతి పెద్ద చేపల దుకాణం ఉంది. ఈ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పెరిగిన పెట్రోల్ ధరను దృష్టిలో ఉంచుకుని రూ.500లకు పైగా చేపలను కొంటే లీటరు పెట్రోల్ ఉచితం అంటూ దుకాణం ముందు బోర్డు పెట్టాడు. దీంతో ఆదివారం నుంచి ఈ దుకాణానికి జనం పోటెత్తారు. చేపలు కొన్న వారికి పెట్రోల్ కోసం కూపన్లు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment