Uorfi Javed Reveals Her FB Profile Photo Was Uploaded On Adult Site & She Was Mentally And Physically Abused By Her Father - Sakshi
Sakshi News home page

Urfi Javed : బూతు సైట్‌లో నా ఫోటో.. రివర్స్‌లో రూ.50 లక్షలు అడుగుతున్నారంటూ..

Published Sun, Apr 9 2023 3:40 PM | Last Updated on Sun, Apr 9 2023 4:14 PM

Urfi Javed Says Her Picture Uploaded on Adult Site, Father Called Adult Star - Sakshi

అదిరేటి డ్రెస్సు నే వేస్తే మీకు దడ.. అంటుంది బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌. నిజంగానే చిత్రవిచిత్ర వస్త్రధారణతో దడ పుట్టిస్టూ ఉంటుంది. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా తాళ్లు, గడ్డిపరక, మల్లెపూలు, చెత్త కవర్‌, చైన్‌, ప్లాస్టర్‌.. ఇలా అన్నింటినీ డ్రెస్సులుగా మార్చేసి ధరిస్తుంది ఉర్ఫీ. అందుకే ఆమె సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయింది. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డ ఉర్ఫీ వాటిని అధిగమిస్తూ సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబమే తనను ద్వేషించిందని చెప్పుకొచ్చింది నటి. 'ఒక ట్యూబ్‌ను టాప్‌గా ధరించిన ఫోటోను నా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాను. కొందరు దాన్ని తీసుకువెళ్లి యదాతథంగా అడల్ట్‌ సైట్‌లో వదిలారు. దాన్ని ఎలాంటి మార్ఫింగ్‌ చేయలేదు కాబట్టి చాలామంది అది నేనేనని సులువుగా గుర్తుపట్టారు. నన్ను అడల్ట్‌ స్టార్‌ అని పిలిచారు. అలా అన్నప్రతిసారి నా వీడియో ఏది? చూపించండని నిలదీసేదాన్ని.

కానీ కన్నతండ్రే నన్ను అడల్ట్‌ స్టార్‌ అని ముద్ర వేశాడు. అడల్ట్‌ సైట్‌ వాళ్లు మమ్మల్ని రూ.50 లక్షలు అడుగుతున్నారని అందరికీ చెప్పేవాడు. బహుశా నా తండ్రి నన్ను చెడ్డదాన్ని చేసి సింపథీ కోరుకున్నాడేమో! నా తండ్రి, బంధువులు అందరూ నన్ను దారుణమైన మాటలన్నారు. కొన్నిసార్లు చేయి చేసుకున్నారు కూడా!' అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ. ఈ అవమానాలు, హింస భరించలేక 17 ఏళ్ల వయసులో తన చెల్లెళ్లను తీసుకుని పోలీసు మెట్లెక్కింది ఉర్ఫీ. కానీ అక్కడ తనకు ఎలాంటి సహాయం దొరక్కపోవడంతో లక్నో వెళ్లింది. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకుంది. కాగా ఉర్ఫీ ఇటీవలె స్ప్లిట్స్‌విల్లా రియాలిటీ షోలో మెరిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement