బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ చిత్రవిచిత్ర డ్రెస్సులతో వెరీ ఫేమస్. రీయూజ్ అనే పదాన్ని బాగా వంటపట్టించుకున్న ఆమె వస్తువులను కూడా వస్త్రధారణ కింద మార్చేస్తూ సరికొత్త అవతారాల్లో దర్శనమిస్తుంటుంది. అయితే ఈ నటికి ఉండటానికి ఇల్లే దొరకడం లేదట. అద్దె ఎక్కువిస్తానన్నా సరే ఎవరూ తలదాచుకోవడానికి ఇల్లు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేసింది ఉర్ఫీ.
'నా వస్త్రధారణ చూసి హిందూముస్లింలెవరూ నాకు ఇల్లు అద్దెకివ్వడం లేదు. కొందరు రాజకీయ నేతల నుంచి నాకు బెదిరింపులు వస్తుండటంతో ఆ భయంతో మరికొందరు యజమానులు వారి ఇల్లు అద్దెకివ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. ముంబైలో అద్దె ఇంటిని పొందడం ఎంతో కష్టం' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఉర్ఫీకి ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా దీనికి ఉర్ఫీ స్పందించింది. 'ఒకసారి కాదు ప్రతిసారి ఇదే పరిస్థితి.. నటిని, అందులోనూ సింగిల్‌గా ఉన్నాను.. నాలాంటి వాళ్లకు ఇల్లు దొరకడం కష్టమే' అని రిప్లై ఇచ్చింది.
Muslim owners don’t want to rent me house cause of the way I dress, Hindi owners don’t want to rent me cause I’m Muslim. Some owners have an issue with the political threats I get . Finding a rental apartment in mumbai is so tuff
— Uorfi (@uorfi_) January 24, 2023
It’s literally Everytime mahn , single , Muslim , actress - impossible to find a house
— Uorfi (@uorfi_) January 24, 2023
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment