
ఉర్ఫీ జావెద్... డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిందామె. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా ఫేమస్ అయిన ఉర్ఫీ బయటకు వచ్చాక నానా రచ్చ చేస్తోంది. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొన్నిసార్లు ఆమె వేసుకునే దుస్తులను చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్ చేస్తారా? అవేం డ్రెస్సులురా బాబూ.. అని తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో ఉర్ఫీ ప్యాంట్ వేసుకోలేదు. దీంతో కెమెరామెన్లు ఆమె వెనకాల పడగా వారిని చూసి ఉర్ఫీ పరుగులు తీసింది. కింద ప్యాంట్ వేసుకోలేదు, రాకండిరా బాబూ అంటూ ఆగకుండా పరుగెత్తింది. అయినా సరే కెమెరామన్లు వదిలిపెట్టలేదు. ప్యాంట్ లేకపోయినా మీరు బాగానే ఉన్నారంటూ ఆమెను షూట్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. ఇక మరో వీడియోలో ఓ వ్యక్తి సెల్ఫీ అడగ్గా సరేనంటూ అతడి పక్కన నిల్చుందా భామ. కానీ అతడు పాన్ తింటూ ఫొటోలు తీస్తుండటంతో ఫక్కున నవ్వేసింది.
Comments
Please login to add a commentAdd a comment