Actress Urfi Javed Faces Harassment By Drunk Men On Flight To Goa - Sakshi
Sakshi News home page

Urfi Javed: నేనేమన్నా పబ్లిక్‌ ప్రాపర్టీనా?.. ఫ్లైట్‌లో ఉర్ఫీ ఫైర్!

Published Sat, Jul 22 2023 6:04 PM | Last Updated on Sat, Jul 22 2023 6:31 PM

Bollywood Actress Urfi Javed harassd In Flight Drunk Person - Sakshi

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్‌ షోతో ఫేమ్ తెచ్చుకున్న భామ ఎప్పుడు ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన ఫ్యాషన్‌ డ్రెస్సులతో నెటిజన్స్‌ను అలరిస్తోంది. అంతే కాదు.. కొన్ని సార్లు ఆమె చేసిన పనులు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. వింత ఫ్యాషన్‌తో విమర్శలకు కేంద్రబిందువుగా మారింది ఉర్ఫీ.

(ఇది చదవండి: సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఆ లిస్ట్‌లో నెంబర్‌ వన్ ప్లేస్!)

 ఇటీవల టమాటాలను చెవి దిద్దులుగా పెట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈసారి తన డ్రెస్‌తో కాదండోయ్. తాను విమానంలో వేధింపులకు గురైనట్లు ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం. 

ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ముంబయి నుంచి గోవా వెళ్తుండగా నన్ను ఓ వ్యక్తి వేధింపులకు గురి చేశాడు. నన్ను ఉద్దేశించి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. నేను వారితో వాదనకు దిగా. ఆ సమయంలో వాళ్లలో ఒకరు మా ఫ్రెండ్ తాగి ఉన్నాడు. వదిలేయండి అని వేడుకున్నాడు.  తాగితే మహిళలను వేధిస్తారా? అంటూ గట్టిగానే మాట్లాడా. అంతే కాదు.. నేను పబ్లిక్‌ ఫిగర్‌నే కానీ.. పబ్లిక్‌ ప్రాపర్టీనైతే కాదు కదా. ' అని రాసుకొచ్చింది. కాగా.. బడే భయ్యా కి దుల్హానియా, మేరీ దుర్గా, బేపన్నా, పంచ్ బీట్ సీజన్ 2, బిగ్‌ బాస్ వంటి షోలతో ఫేమ్ తెచ్చుకుంది. ఎప్పుడు వింత వింత ఫ్యాషన్‌ డ్రెస్సులు ధరిస్తూ ఎప్పుడు తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. 

(ఇది చదవండి: బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్‌ అడిగారు: సీరియల్‌ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement