Urfi Javed Apologises For Hurting Sentiments By Wearing Bold Clothes, Deets Inside - Sakshi
Sakshi News home page

Urfi Javed: ఇక నుంచి కొ‍త్త ఉర్ఫీని చూస్తారు.. షాకింగ్ ట్వీట్ వైరల్

Published Sat, Apr 1 2023 5:03 PM | Last Updated on Sat, Apr 1 2023 6:29 PM

Urfi Javed apologises for hurting sentiments by wearing BOLD clothes - Sakshi

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు.  ఎప్పుడు తన విచిత్రమైన వస్త్రాధారణతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఉర్ఫీ బోల్డ్ దుస్తులతో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. తాజాగా ఉర్ఫీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఒక ట్వీట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఉర్పీ తన ట్వీట్‌లో రాస్తూ.. 'నేను వేసుకున్న దుస్తుల వల్ల అందరి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా. ఇప్పటి నుంచి మీరు కొత్త ఉర్ఫీని చూస్తారు. ఇకపై అలాంటి దుస్తులు ధరించను' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ ట్వీట్ చేసింది ఆమెనేనా అంటూ అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. అయితే ఉర్ఫీ జావేద్ చేసిన ఈ ట్వీట్‌పై చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నారు. 

నెటిజన్స్ ఊహించినట్లే ఏప్రిల్ ఫూల్ అంటూ ఉర్ఫీ మరో ట్వీట్ చేసింది. నా గురించి నాకు తెలుసంటూ నెటిజన్లకు షాకిచ్చింది. పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ. తన డ్రెస్ సెన్స్‌తో పలుసార్లు విమర్శలకు గురైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement