చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి మెచ్చుకునేవాళ్లకంటే బుగ్గలు నొక్కుకునేవాళ్లే ఎక్కువ. వెరైటీ డ్రెస్సులతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానసిక ఒత్తిడి గురించి మాట్లాడింది. తనను నటిగా కాదు కదా, కనీసం ఫ్యాషన్ డిజైనర్‌గా చూసేందుకు కూడా ఇంటిసభ్యులు ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. తనకున్న ప్యాషన్‌ను వదిలేయలేక ఇంటిని వదిలేసి వచ్చానంది. అలా బుల్లితెర ధారావాహికల్లో చిన్నచిన్న పాత్రలు పోషించానంది.
ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలపాటు మానసిక వేదనను అనుభవించానంది. ఎప్పటికీ ఇలానే బతకాలా? లేదంటే ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా? అనిపించిందని చెప్తూ బాధపడింది. అలాంటి స్థితి నుంచి బయటపడేందుకు చాలా కాలమే పట్టిందని తెలిపింది. జీవితంలో ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకున్నాను, కానీ పరిస్థితుల వల్ల చిన్న చిన్నపాత్రలు చేయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది ఉర్ఫీ.
తనపై జరిగే ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. 'నా ఫొటోలు వైరల్ అయినా, ఎవరైనా నా పిక్స్ పోస్ట్ చేసినా చాలు కొందరు నటీమణులు తెగ ఉడికిపోతుంటారు. వల్గర్‌గా ఉంది, అసహ్యమేస్తోంది అని కామెంట్లు చేస్తుంటారు. అది చూసినప్పుడు అసలు నేను మిమ్మల్ని ఏమన్నానని ఇలా మాట్లాడుతున్నారు? అనిపిస్తుంటుంది. డ్రెస్సింగ్ విషయంలో నేనెప్పుడూ బోల్డ్‌గానే ఉంటాను. నన్ను ప్రేమించినా, ద్వేషించినా అస్సలు పట్టించుకోను. మీరు పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మాట్లాడినా అది నాకు మంచే చేస్తుంది' సమాధానమిచ్చింది ఉర్ఫీ జావెద్.
చదవండి: నన్ను రావణాసురుడితో పోలిస్తే బాగుంటుంది: ఆర్జీవీ
రాఖీభాయ్‌తో విజయ్, షాహిద్ ఢీ.. ఏప్రిల్ 14న ఏం జరగబోతోంది?
Comments
Please login to add a commentAdd a comment