
ఉర్ఫీ జావెద్.. సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అరక్కర్లేని పేరు. చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫీ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.డిఫరెంట్ ఫ్యాషన్ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడిన ఉర్ఫీ అయినా తీరు మార్చుకోకుండా తనదైన స్టైల్‌లోనే దర్శనమిస్తుంటుంది.అయితే ఈమధ్యకాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం లేదు.
ఇందుకు కారణం ఉర్ఫీ హాస్పిటల్ పాలవడమే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఆరోగ్యంపై అశ్రద్దను వహించడమే ఇందుకు కారణమంటూ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.