
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే బిగ్‌బాస్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ రియాలిటీ షో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డానంటోంది.
చదవండి: ‘లైగర్’ ఎఫెక్ట్.. రెంట్ కట్టలేక ఆ ఫ్లాట్ ఖాళీ చేసిన పూరీ?
ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఎనిమిదేళ్లకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యింది. ‘8 సంవత్సరాలుగా పీకల్లోతూ అప్పుల్లో కురుకపోయాను. కనీసం బిగ్‌బాస్ ఓటీటీ షోకి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు కూడా లేకుంటే. షో వేసుకునేందుకు కావాల్సిన దుస్తులను కూడా అప్పు చేసి కొన్నాను. అంత కష్టపడి బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెడితే కనీసం అవసరాలు తీర్చే డబ్బు కూడా రాలేదు. మొదటి వారంలోనే బయటకు వచ్చాను. దీంతో నా ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటికీ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అంటూ ఆమె భావోద్యేగానికి లోనయ్యింది.
చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే..
Comments
Please login to add a commentAdd a comment