జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు | Jayalalitha death mystery: Doctor arrested in chennai | Sakshi
Sakshi News home page

జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు

Published Sat, Feb 25 2017 9:15 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు - Sakshi

జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు

చెన్నై:
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్‌ రామసీతను శనివారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన రామసీత జయలలిత మేన కోడలు దీప, మాజీ సీఎం పన్నీరుసెల్వంలను వేర్వేరుగా కలిసి తన మద్దతు ప్రకటించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక డాక్టర్‌గా జయలలిత మరణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. ఇంటి నుంచి అపొలో ఆస్పత్రికి వచ్చే సమయంలో జయలలితకు స్పృహ కూడా లేదని, ఆమె వెంట బంధువులు ఎవ్వరూ రాలేదని పేర్కొన్నారు. జయలలిత చికిత్స పొందిన ప్రత్యేక గది వైపు ఏ ఒక్క డాక్టర్నీ అనుమతించలేదని ఆరోపించారు. జయలలిత జయంతి సందర్భంగా శుక్రవారం మరోమారు ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సైబర్‌ క్రైం పోలీసులు ఆమెపై మూడు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేశారు. రామసీత అసలు డాక్టరే కాదని సైబర్‌క్రైం వర్గాలు వాదిస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement