సాక్షి, న్యూఢిల్లీ : తమ తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని దివంగత సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా కుమారుడు అనుజ్ లోయా చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబాన్ని వేధించవద్దని మీడియాకు, ఎన్‌జీవోలకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా తమ కుటుంబం బాధాకరమైన ఘటనలను ఎదుర్కొందని అన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయ 2014 డిసెంబర్‌లో మరణించారు. ఈ కేసు నుంచి అమిత్ షాను ఆ తర్వాత కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది.
అయితే జస్టిస్ లోయా అనుమానాస్పద పరిస్థితిల్లో మరణించారంటూ దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ అంశం తీవ్రతను గమనించిన సుప్రీం కోర్టు దీనిపై సంబంధిత పత్రాలను సమర్పించాలని, సోమవారం ఈ అంశాన్ని చేపడతామని పేర్కొంది. అయితే ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని,దీన్ని సుప్రీం కోర్టు విచారించరాదని ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే బాంబే లాయర్స్ అసోసియేషన్ తరపున సుప్రీం కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment