14 ఏళ్లకే పెళ్లి.. ఆపై వేధింపులు.. అర్ధాంతరంగా ముగిసిన నటి జీవితం! | Silk Smitha Married At 14, She Faced Domestic Violence And Her Family Financial Condition Not Good - Sakshi
Sakshi News home page

Silk Smitha: పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించింది.. 35 ఏళ్లకే కెరీర్ ముగించింది!

Published Wed, Sep 13 2023 4:27 PM | Last Updated on Wed, Sep 13 2023 5:14 PM

Silk Smitha married at 14 and Her Family Financial Condition Not Good - Sakshi

తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.  బావ బావమరిది చిత్రంలోని బావలు సయ్యా అనే పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. డిసెంబర్ 2, 1960లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించిన సిల్మ్ స్మిత అసలు పేరు విజయలక్ష‍్మి. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. మొదటి సిల్క్ స్మిత సహాయ నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 1979లో తమిళ చిత్రం వండిచక్రంలో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలా సినీ ఇండస్ట్రీలో 17 ఏళ్ల ఓ వెలుగు వెలిగిన  సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. సెప్టెంబర్ 23, 1996న 35 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

(ఇది చదవండి: విదేశాలకు ప్రభాస్‌.. సర్జరీ కోసమేనా!)

కుటుంబ నేపథ్యం

దాదాపు 450 చిత్రాల్లో కనిపించిన సిల్క్ స్మిత..  కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో బాల్యంలోనే చదువు వదిలేయాల్సి వచ్చింది.  సిల్క్ స్మితకు 14 ఏళ్లకే పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత సిల్క్ స్మితకు భర్త, అత్తమామలు వేధింపులు ఎక్కువయ్యాయి. వీటన్నింటిని భరించలేక ఆమె ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. భర్త ఇంటి నుంచి మేకప్ ఆర్టిస్ట్ అయిన తన స్నేహితురాలి వద్దకు వెళ్లింది. తన స్నేహితురాలితో కలిసి సినిమా సెట్స్‌కి వెళ్లి మేకప్ కళను నేర్చుకుంది.  కొన్ని నెలలకే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. 

ఆ సమయంలో చిత్ర దర్శకుడు ఆంథోనీ ఈస్ట్‌మన్ ఆమెకు ఓ చిత్రంలో అవకాశమిచ్చాడు. అదే సిల్క్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత తమిళ దర్శకుడు విను చక్రవర్తి సిల్క్ స్మితకు నటన, డ్యాన్స్, ఇంగ్లీష్ నేర్చుకునేలా ఏర్పాట్లు కూడా చేశాడు. అప్పటి నుంచి సిల్క్ స్మిత తన కెరీర్‌లో వెనక్కి తిరిగి తీసుకోలేదు. స్టార్‌ హీరోలు నటించిన పెద్ద చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. సిల్క్ తమిళం, మలయాళం, తెలుగు, హిందీతో సహా అన్ని భాషల్లోని చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో మెరిసింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్‌, కోలీవుడ్ స్టార్ కమల్‌హాసన్‌ వంటి పెద్ద స్టార్ల చిత్రాల్లో నటించింది. 

(ఇది చదవండి: సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్‌)

హోటల్‌లో సూసైడ్

వెండితెరపై ఆమెకు గొప్ప ప్రశంసలు దక్కినప్పటికీ.. ఆమె తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా సాగలేదు. ఆ తర్వాత ఆమె ఓ వైద్యుడిని వివాహం చేసుకుందని.. ఆమె సంపాదన మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అతను నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కోల్పోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో సిల్క్ స్మిత సెప్టెంబరు 23, 1996న ఓ హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సిల్క్ స్మిత.. తన జీవితం సంతోషంగా లేదని.. నమ్మినవారే మోసం చేశారంటూ.. అందుకే ఈ లోకాన్ని విడిచివెళుతున్నట్లు రాసుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement