![Saif Ali Khan AND Rani Mukerji wrap shooting for Bunty Aur Babli - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/13/Bunty-aur-bubli.jpg.webp?itok=6mDO1i6f)
రాణీ ముఖర్జీ, సైఫ్ అలీఖాన్
అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ జంటగా 2005లో వచ్చిన హిందీ చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ’. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. వరుణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ (అభిషేక్ స్థానంలో), రాణీ ముఖర్జీ జంటగా నటించారు. సిద్ధాంత్ చతుర్వేదీ, షర్వారీ ఇతర పాత్రలు చేశారు. కరోనా వల్ల కొంత భాగం చిత్రీకరణ వాయిదా పడింది. ఆ భాగాన్ని ఇటీవలే ప్రారంభించి, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమా చిత్రీకరణను శనివారంతో పూర్తి చేశారు. దాంతో యూనిట్ సభ్యులందరూ బైబై చెప్పుకున్నారు. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో మొదటి భాగానికి మించిన వినోదం ఉంటుందట. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment