ఆన్‌ డ్యూటీ | Rani Mukerji will return as a cop in Mardaani sequel | Sakshi
Sakshi News home page

ఆన్‌ డ్యూటీ

Published Mon, Mar 25 2019 12:10 AM | Last Updated on Mon, Mar 25 2019 12:10 AM

Rani Mukerji will return as a cop in Mardaani sequel - Sakshi

రాణీ ముఖర్జీ

నాలుగేళ్ల తర్వాత శివానీ శివాజీ రాయ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మళ్లీ చార్జ్‌ తీసుకున్నారు. డ్యూటీ మొదలు పెట్టారు. ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ఫిల్మ్స్‌ నిర్మాణంలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మర్దాని’(2014). ఇటీవల ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు యశ్‌రాజ్‌ సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాణీ ముఖర్జీనే హీరోయిన్‌గా నటిస్తారు. అయితే ‘మర్దాని’ చిత్రానికి రచయితగా పనిచేసిన గోపీ పుత్రన్‌ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తొలుత  నైట్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘మర్దాని’ చిత్రం చైల్డ్‌ హ్యూమన్‌ ట్రాఫిక్‌ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీక్వెల్‌లో మరో కొత్త పాయింట్‌ను టచ్‌ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement