శివానీ శివాజీ రిటర్న్స్‌ | Rani Mukerji commences the shooting of Mardaani 2 | Sakshi
Sakshi News home page

శివానీ శివాజీ రిటర్న్స్‌

Published Thu, Mar 28 2019 3:00 AM | Last Updated on Thu, Mar 28 2019 3:00 AM

Rani Mukerji commences the shooting of Mardaani 2 - Sakshi

రాణీ ముఖర్జీ

ఐదేళ్ల  క్రితం ‘మర్దానీ’ చిత్రంలో శివానీ శివాజీ రాయ్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించారు రాణీ ముఖర్జీ. మంచి హిట్‌ అయింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందించే పనిలో పడ్డారు. ‘మర్దానీ 2’ కోసం మరోసారి శివానీ శివాజీ రాయ్‌ క్యారెక్టర్‌లోకి తిరిగొచ్చారు రాణీ. పోలీస్‌ ఫ్రాంచైజ్‌ సినిమాల్లో ఎక్కువ హీరోలే కనిపిస్తుంటారు. కానీ లేడీ ఓరియంటెడ్‌ పోలీస్‌ ఫ్రాంచైజ్‌ సినిమాతో ‘మర్దానీ 2’ కూడా ఆ ట్రెండ్‌ స్టార్ట్‌ చేసింది. ఈ సీక్వెల్‌లో రాణీ లుక్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు చిత్రబృందం. మొదటి భాగానికి రచయితగా పని చేసిన గోపీ పుత్రన్‌ ఈ సీక్వెల్‌ ద్వారా దర్శకుడిగా మారారు. ‘‘ఫ్రాంచైజ్‌ సినిమాలు చేయడం తొలిసారి. అలానే మళ్లీ శివానీ పాత్ర చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌’’ అని పేర్కొన్నారు రాణీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement