పరాయి దేశంతో పోరాడే వివాహిత కథ! | Rani Mukherjee To Star In Mistress Chatterjee Vs Norway | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా సీక్వెల్‌లో రాణీ ముఖర్జీ

Published Mon, Mar 22 2021 9:00 AM | Last Updated on Mon, Mar 22 2021 9:00 AM

Rani Mukherjee To Star In Mistress Chatterjee Vs Norway - Sakshi

నార్వే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడనున్నారు బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ. ఎందుకంటే ‘మిస్ట్రస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ సినిమా కోసం. మార్చి 21న రాణీ ముఖర్జీ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఆషిమా చిబ్బర్‌ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.

‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇది ఓ మంచి హ్యూమన్‌ స్టోరీ. తన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఓ వివాహిత పరాయి దేశంతో పోరాడే కథ ఇది. ఈ సినిమా కథ బాగా నచ్చింది. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు, ఇటువంటి సినిమాను నా బర్త్‌ డే సందర్భంగా అనౌన్స్‌ చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ. ఇక రాణి తాజా చిత్రం ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ వచ్చే నెల విడుదల కానుంది. పదిహేనేళ్ల క్రితం రూపొందిన ‘బంటీ ఔర్‌ బబ్లీ’కి ఇది సీక్వెల్‌. తొలి భాగంలోనూ రాణీ ముఖర్జీ నటించారు.

చదవండి: ఈ హీరోయిన్‌ నిజ జీవితంలోనూ ఓ సివంగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement