కడుపులో బిడ్డ పెరుగుతుందంటే కోటి ఆశలతో ఎదురు చూస్తుందా మహిళ. కానీ ఆ బిడ్డ ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే కాలం చేసిందంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుందో! అలాంటి నరకవేదన అనుభవించింది రాణి ముఖర్జీ.. తనకు గర్భస్రావమైన విషయాన్ని గతేడాది వెల్లడించింది. తాజాగా మరోసారి ఆ బాధను గుర్తు చేసుకుంది నటి.
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించా..
'నా కూతురికి ఇప్పుడు ఎనిమిదేళ్లు. తనకు ఏడాది వయసు రాగానే మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాను. దాదాపు ఏడేళ్లు ప్రయత్నించాము. 2020వ ఏడాది గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎన్నోనాళ్లు నిలవలేదు. కడుపులోనే బిడ్డను కోల్పోయాను. ఆ నరకం అనుభవించినవారికే తెలుస్తుంది. నేను పైకి కనిపించేంత యంగ్ కాదు. నేనిప్పుడు 46వ పడిలోకి అడుగుపెట్టాను. ఈ వయసులో బిడ్డను కనలేను. కానీ నా కూతురికి ఒక తమ్ముడినో, చెల్లెనో ఇవ్వలేకపోయానన్న బాధ మాత్రం ఇప్పటికీ ఉంది.
తనతో ఆడుకోవడానికి బిడ్డను ఇవ్వలేకపోయా
అయినా ఉన్నదాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి. అధీరా (రాణి కూతురు) నా బంగారు తల్లి. తన వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటేశాను. కాబట్టి నాకు అధీరా ఒక్కరు చాలు' అని చెప్పుకొచ్చింది. కాగా రాణి ముఖర్జీ.. హలో బ్రదర్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, ప్యార్ దీవానా హోతా హై, చలో ఇష్క్ లడాయే, చోరీ చోరీ, ఎల్‌వోసీ: కార్గిల్, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి హిట్ చిత్రాల్లో నటించింది.
చదవండి: అయ్యో శ్రీలీల.. అప్పుడేమో నెలకో సినిమా.. ఇప్పుడేమో ఇలా..
Comments
Please login to add a commentAdd a comment