మళ్లీ తెరపైకి శివానీ శివాజీ రాయ్‌ | rani mukerji to return as shivani roy in mardaani 3 | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి శివానీ శివాజీ రాయ్‌

Published Fri, Aug 23 2024 12:14 AM | Last Updated on Fri, Aug 23 2024 12:14 AM

rani mukerji to return as shivani roy in mardaani 3

బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణీ ముఖర్జీ లీడ్‌ రోల్‌లో నటించిన ‘మర్దానీ 3’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆమె లీడ్‌ రోల్‌లో ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మర్దానీ’. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2014 ఆగస్టు 22న విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివానీ శివాజీ రాయ్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాణీ ముఖర్జీ నటించారు.

న్యాయం కోసం పోరాడే వారి కోసం ధైర్యంగా నిలబడే పాత్రలో తనదైన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. అంతేకాదు... కష్టాల్లో ఉన్న వారిని కాపాడటం కోసం ఎంతటి రిస్క్‌ అయినా చేసే రోల్‌లో అద్భుతంగా నటించి, మెప్పించారు. ‘మర్దానీ’కి సీక్వెల్‌గా రాణీ ముఖర్జీ లీడ్‌ రోల్‌లోనే ‘మర్దానీ 2’ సినిమా రూపొందింది.

గోపీ పుత్రన్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ‘మర్దానీ’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేసింది యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌. మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా రాణీ ముఖర్జీ నటన చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి అని మేకర్స్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement