
తమన్నా
తమన్నా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే కచ్చితంగా తన డ్యాన్స్ గురించి ప్రస్తావించాల్సిందే. ‘రచ్చ’లోని ‘వానా వానా వెల్లువాయే...’, ‘బద్రినాథ్’లో ‘కళ్లు మూస్తే బద్రినాథ్...’ పాటలు అందుకు చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఏకంగా డ్యాన్సర్ పాత్ర అంటే.. తమన్నా స్టేజ్‌ని షేక్ చేసేస్తారని ఊహించవచ్చు. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, తమన్నా కథానాయికలు. శుక్రవారం తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ లోని ఆమె పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో లక్ష్మీ అనే నాట్యకళాకారిణి పాత్రను పోషిస్తున్నారట తమన్నా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది.
దటీజ్ మహాలక్ష్మీ
తమన్నా నటించిన మరో చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మీ’ టీజర్‌ను కూడా శుక్రవారం రిలీజ్ చేశారు. బాలీవుడ్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలవుతోంది.