
జూన్ మొదటివారం నుంచి నర్సింహా రెడ్డి సమరానికి సిద్ధం అవుతారట. తొలకరి జల్లులు కురిసే సమయానికి తిరుగుబాటు మొదలు పెట్టనున్నారట. చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ‘సైరా’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ 5నుంచి స్టార్ట్ కానుంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, మరికొందరు ముఖ్య నటీనటులు పాల్గొంటారు. ‘సైరా’ మూవీలోకి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవ్వరట. ఆగస్ట్‌లో జరగబోయే మరో కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.