
తమన్నా
షూటింగ్‌లు, ప్రమోషన్‌లు, కొత్త సినిమా స్క్రిప్ట్‌లు వినడం... ఇలా ఆర్టిస్టుల లైఫ్ బిజీ బిజీగా ఉంటుంది. ఎప్పుడో కానీ కాస్త టైమ్ దొరకదు. ఆ టైమ్‌లో ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంటారు. సోనమ్ కపూర్, శ్రుతీహాసన్ లాంటి హీరోయిన్లు ఖాళీ సమయాల్లో బొమ్మలు వేస్తారు. శ్రియ, దిశా పాట్నీ, పరిణీతి కేటగిరీ వారు సముద్రతీరాలకు వాలిపోతారు. మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం వంటింట్లోకి దూరి గరిటె చేత పట్టుకుని దోశలు వేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ యాప్‌లో షేర్ చేసుకున్నారు. మరి.. దోశ టేస్ట్ ఎలా ఉందనే విషయం మాత్రం ఈ బ్యూటీనే అడగాలి. వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులు మనసులు దోచేసిన తమన్నా ఇప్పుడు కావాల్సినవాళ్లకు ఇంట్లో దోసెలు వేసి, వారి మనసుని కూడా దోసేస్తున్నారేమో! ఇక సినిమాల విషయానికి వస్తే.. సౌత్‌లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ‘బోలే ఛూడియా’ అనే హిందీ సినిమాకు సైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment