
లాక్‌డౌన్‌తో దొరికిన ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్ దాగి ఉందని తమన్నా తెలుసుకునేలా చేసింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్స్‌తో ఫుల్æబిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్‌లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు.
ఈ లాక్‌డౌన్‌లో అవన్నీ తెలుసుకున్నాను. అవసరానికి మించిన వస్తువులు ఉన్నాయని గ్రహించాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్‌డౌన్ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్ చేసిన మొదట్లో కిచెన్ రూమ్‌లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. ఆ వంటలు వండిన పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వంట రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment