‘‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా పెరిగిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అంటున్నారు తమన్నా. అలాగే నటీనటుల స్టార్‌డమ్ విషయంలో కూడా ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోందని అంటున్నారీ బ్యూటీ. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒకప్పుడు జస్ట్ ప్రతిభ ఉంటేనే ఫ్యాన్స్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు నటీనటుల ప్రతిభని మాత్రమే చూసి, ఫ్యాన్స్ అయిపోవడంలేదు.
ప్రతిభతో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్న కొత్తదనానికి తగ్గ పాత్రలు చేసినప్పుడే యాక్టర్స్ వారి అభిమానాన్ని మరింత పొందగలుగుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు డిఫరెంట్‌గా ఉండేది. పదేళ్ల క్రితం ఫ్యాన్‌బేస్ ఆర్గానిక్‌గా ఉండేది. ఏది ఏమైనా ఆ తరం అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా నేను పొందగలగడం నా లక్’’ అన్నారు. తమన్నా నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీటీమార్’ సినిమా ను పూర్తి చేసిన తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తు న్నారు.
Comments
Please login to add a commentAdd a comment