
చిరంజీవి
‘జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్‌లో గ్యాప్ ఉండదు’ అంటూ ‘బ్రూస్‌లీ’ చిత్రంలో అతిథిగా మెరిశారు చిరంజీవి. ‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ అంటూ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో హీరోగా గ్రాండ్‌గా రీ–ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ చిరు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు.
ఆ మధ్య అమితాబ్ బచ్చన్ షూటింగ్‌లో పాల్గొనగా చిరు, నయన హోమం చేస్తున్న ఫొటోలు బయటికొచ్చాయి. ఆ లుక్‌లో చిరుని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. అయితే సినిమా మొత్తం చిరు ఇలాగే ఉంటారా? లేక వేరే లుక్‌లో ఉంటారా? అన్న డౌట్ లేకపోలేదు. అందుకే.. ‘సైరా’లో చిరంజీవి ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జస్ట్ రెండు నెలలు వెయిట్ చేస్తే చాలు.. ఆ లుక్‌ని చూడొచ్చన్నది తాజా ఖబర్. ఆగస్ట్ 22 చిరు పుట్టినరోజుకి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందట.