‘‘ఏ ఆర్టిస్ట్ పారితోషికం అయినా వాళ్ల మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ మేం ఎంత అడిగితే అంత నిర్మాతలు ఇవ్వరు’’ అంటున్నారు తమన్నా. అడిగినంత పారితోషికం ఇవ్వని కారణంగా ఇటీవల ఆమె ఓ సినిమా వదులుకున్నారనే వార్త వచ్చింది. అయితే ఈ వార్తలో నిజం లేదన్నారు ఈ మిల్కీ బ్యూటీ.
ఈ సందర్భంగా పారితోషికం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ఒక నిర్మాత నాకు పారితోషికం ఇస్తున్నారంటే నేను అంత అడిగానని ఇవ్వడంలేదు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు. నా గత చిత్రాల బాక్సాఫీసు హిట్స్‌ను అంచనా వేసి, పారితోషికం ఇస్తారు. అంతేకానీ నేనేదో నాకు తోచినంత అడిగి, కచ్చితంగా అంత ఇవ్వాలని ఎదురు చూడకూడదు. అంత తీసుకునే అర్హత ఉంటేనే అడగాలి. నేను అడిగే పారితోషికం సరైనదని నాకు అనిపిస్తేనే అడుగుతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment