
‘‘హీరోయిన్‌గా 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లల్లో వివిధ రకాల సినిమాల్లో భాగమయ్యే అవకాశం లభించింది. గతంలో కొన్ని సినిమాలు చేయాలనుకున్నా ప్రేక్షకులు చూస్తారో? చూడరో? అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. ఆ మార్పు బాగా కనిపిస్తోంది’’ అన్నారు తమన్నా. ప్రస్తుతం తన దగ్గరకు వస్తున్న పాత్రలు, ప్రేక్షకులు సినిమా చూస్తున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు భిన్నమైన సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. కొత్త ఐడియాలకు స్వాగతం పలుకుతున్నారు. ఇంతకుముందు చేయలేం అనుకున్న పాత్రలు ఇప్పుడు నమ్మకంగా చేయొచ్చు. నా దగ్గరకు వచ్చే పాత్రల్లో కూడా మార్పును గమనించాను. పాత్రల్లో కొత్తదనం ఉండి, అవి మేము (హీరోయిన్లు) చేయగలమని దర్శకులు నమ్మడం యాక్టర్‌గా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తోంది. చేసే ప్రతీ పాత్రలో వ్యత్యాసం చూపించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment