
తమన్నా
మనలో కొందరం ఎప్పుడూ ఒకే ప్రశ్నను పదే పదే అనుకుంటాం. అది ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్న. తమన్నాను దాదాపు పదేళ్లుగా అలాంటి ఓ ప్రశ్న వెంటాడుతోంది. ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా దాని గురించి అనుకుంటున్నారట. ‘ఏం చేశానని..?’ అన్నది ఆ ప్రశ్న. ఇంతకీ తమన్నా ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే? లక్షలాది మంది అభిమానులను చూసి, ఇలా తనని తాను ప్రశ్నించుకుంటున్నారట. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడానికి జీవితంలో నేను ఏం చేశానని..? యాక్టింగ్ అనేది నా జాబ్.
ఈ జాబ్ ఇంతమంది ప్రేమను ఇస్తుందంటే.. నేను వాళ్ల కోసం ఏం చేశానని? నాకైతే ఇది మిస్టరీలా అనిపిస్తోంది. ఎందుకంటే అందరిలా నేను కూడా మనిషినే కదా. ఒక మనిషి ఇంతమంది ‘అటెన్షన్’ని సాధించడం ఏంటి? అందుకే నేను అభిమానులకు రుణపడి పోయా. నన్ను అభిమానించేవాళ్లందర్నీ కలవాలంటే ఈ జీవితం మొత్తం సరిపోదు. కానీ, జీవితాంతం మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు లేనిది నేను లేను’’ అంటున్నారు తమన్నా. ఇంతకీ ‘నేనేం చేశానని?’ తమన్నా అనుకుంటున్నారు కానీ సిల్వర్ స్క్రీన్‌పై మెరుస్తున్న ఈ మెరుపు తీగను చూస్తే అదో హాయి. అది చాలదా ఫ్యాన్స్‌కి.
Comments
Please login to add a commentAdd a comment