యాక్టర్‌గా తమ పరిధిని పెంచుకోవాలనుకునే వారు కొత్త చాలెంజ్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త చాలెంజ్‌లను తీసుకొని తమని తాము ఇంప్రూవ్ చేసుకుంటారు. ‘నేను కూడా అదే కోవకు చెందుతాను’ అంటున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవి సరసన ‘సైరా’ సినిమాలో యాక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర గురించి, అందులోని చాలెంజ్ గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు, అమితాబ్ బచ్చన్‌గారు వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
నా ఫేవరెట్ యాక్టర్స్‌తో యాక్ట్ చేయడం హానర్‌గా ఫీల్ అవుతున్నాను. నేను చేయబోయే పాత్రకు రిఫరెన్స్‌గా తీసుకోవడానికి, ఆన్‌లైన్‌లో చదవడానికి కూడా ఎక్కువ మెటీరియల్ లేదు. చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇది చాలా చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ఇలాంటి చాలెంజ్‌లకు నేను ఎప్పుడూ రెడీ. ఈ క్యారెక్టర్‌ను వీలైనంత రియల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాను’’ అని తమన్నా పేర్కొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆల్రెడీ నయనతార ఒక హీరోయిన్‌గా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment