
తమన్నా
‘రాజు గారి గది’ ఫస్ట్, సెకండ్ పార్ట్స్ హిట్స్‌గా నిలవడంతో, ఈ హారర్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. సెకండ్ పార్ట్‌లో నాగార్జున, సమంత నటించడంతో ‘రాజుగారి గది 2’ పెద్ద సినిమా అయింది. ‘రాజుగారి గది’కి మూడో పార్ట్ తెరకెక్కిస్తా అని దర్శకుడు ఓంకార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్లాన్‌లో ఉన్నారు. ఈ మూడో భాగంలో హీరోయిన్‌గా తమన్నాను సంప్రదించారట. ముంబై వెళ్లి తమన్నాకు కథ కూడా వినిపించారట. ఇందులో నటించేందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మరి భయంకరమైన రాజుగారి గదిలో ఏముందో తెలుసుకోవడానికి ధైర్యంగా తమన్నా అడుగుపెడతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి, దేవీ 2’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సైరా : నరసింహారెడ్డి’లో కీలక పాత్ర చేస్తున్నారామె.