స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Dec 14 2018 5:52 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

tollywood movies special screen test - Sakshi

పదే పదే వినాలనిపించే పాట ఏ సినిమాకైనా ప్లస్‌ అవుతుంది. ఆడియో రిలీజయ్యాక ఆ పాట విని, సినిమా చూడటం కోసం థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. ఇలాంటి పసందైన పాటలు సంగీత దర్శకులు, పాట రాసినవారు, పాడిన వారు, నటించిన వారు, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కృషి ఫలితమే. 2018లో బాగా విసిపించిన ఇలాంటి క్రేజీ సాంగ్స్‌ గురించి ఈ వారం క్విజ్‌. పాడుకుంటూ చదవండి.

1 ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...’ పాటలో హీరో విజయ్‌ దేవరకొండతో నటించిన హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) రష్మికా మండన్నా  బి) అనూ ఇమ్మాన్యుయేల్‌  సి) లావణ్యా త్రిపాఠి   డి) నివేథా థామస్‌

2  రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ చిత్రంలోని హై వోల్టేజి సాంగ్‌ ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌...జిగేలు రాణి...’లో నటించిన ప్రముఖ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) కియరా అద్వానీ   బి) తమన్నా భాటియా సి) పూజా హెగ్డే         డి) శ్రుతీహాసన్‌

3 ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని మెలోడియస్‌ సాంగ్‌ ‘పెనివిటి...’ పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) సిరివెన్నెల             బి) శ్రీమణి  సి) అనంత శ్రీరామ్‌ డి) రామజోగయ్య శాస్త్రి

4 ‘భరత్‌ అనే నేను హామీ ఇస్తున్నాను..’ పాట ‘భరత్‌ అనే నేను’ చిత్రం లోనిది. ఆ చిత్ర  సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) దేవిశ్రీ ప్రసాద్‌           బి) గోపి సుందర్‌  సి) యం.యం. కీరవాణి  డి) తమన్‌

5 ‘దారి చూడు దుమ్ము చూడు మామా, దున్నపోతుల మేరే చూడు...’ పాట నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోనిది. ఆ పాట రచయిత, గాయకుడు ఎవరో తెలుసా?
ఎ) పెంచల్‌ దాస్‌   బి) రేలా కుమార్‌  సి) శివనాగులు      డి) వరంగల్‌ శ్రీను

6 ‘వారు వీరు అంతా చూస్తూ ఉన్న...’ పాట నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్‌’ చిత్రంలోనిది. ఆ పాటలోని మేల్‌ వాయిస్‌ను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. మరి లేడీ వాయిస్‌ ఎవరిదో తెలుసా?
ఎ) గీతా మా«ధురి      బి) సునీత  సి) అంజనా సౌమ్య   డి) రమ్య బెహరా

7 ఆర్‌. నారాయణమూర్తి నటించి, దర్శక నిర్మాతగా చేసిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రంలోని ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేన వేల వందనాలమ్మ ...’ పాట గాయకుడు ఎవరు?
ఎ) వందేమాతరం శ్రీనివాస్‌ బి) గద్దర్‌  సి) వంగపండు   డి) గోరేటి వెంకన్న

8 1993లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది...లగ్గాయత్తు..’ సాంగ్‌ సూపర్‌ హిట్‌. ఆ పాటను ‘సవ్యసాచి’ చిత్రం కోసం సంగీత దర్శకుడు యం. యం. కీరవాణి రీమిక్స్‌ చేశారు. హీరో నాగచైతన్య సరసన ఈ పాటలో నటించిన నూతన నటి ఎవరో తెలుసా?
ఎ) పాయల్‌ రాజ్‌పుత్‌ బి) నిధీ అగర్వాల్‌ సి) నభా నటేశ్‌ డి) ప్రియాంక జవాల్కర్‌

9 సుధీర్‌ బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రంలోని ‘ఓ చెలి తార... నా మనసారా...’ పాట సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) వివేక్‌ సాగర్‌  బి) చైతన్య భరద్వాజ్‌  సి) సాగర్‌ మహతి  డి) ప్రశాంత్‌ విహారి

10 ‘పిచ్చి పిచ్చిగా నచ్చావురా.. మనోహరా...’ అంటూ ‘నర్తనశాల’ చిత్రంలోని విరహగీతాన్ని ఆలపించిన సింగర్‌ ఎవరో తెలుసా?
ఎ) లిప్సికా బి) మోహన భోగరాజు సి) సమీరా భరద్వాజ్‌ డి) దామిని బాట్ల

11 ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా, కాళిదాస ప్రేమ కావ్యమా, త్యాగరాజు సంగీతమా... గీతమా’ పాట పాడిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా?
ఎ) శ్రేయా ఘోషల్‌   బి) మానసి  సి) కల్పన           డి) కౌసల్య

12 ‘బయటికొచ్చి చూస్తే టైమేమో... త్రీ ఓ క్లాక్‌.. ఇంటికెళ్లే 12బి రూటు మొత్తం రోడ్డు బ్లాక్‌..’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) సంతోశ్‌ నారాయణ్‌ బి) యువన్‌ శంకర్‌రాజా సి) హిప్‌ హాప్‌ తమిళ డి) అనిరు«ద్‌ రవిచంద్రన్‌

13 ‘రంగస్థలం’ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌. ఆ సినిమాకి సింగిల్‌ కార్డు రైటర్‌గా సాహిత్యాన్ని అందించిన రచయితెవరు?
ఎ) రామజోగయ్య శాస్త్రి బి) చంద్రబోస్‌  సి) భువనచంద్ర డి) అనంత శ్రీరామ్‌

14 ‘అయామే లవర్‌ ఆల్సో, ఫైటర్‌ ఆల్సో...’ అంటూ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో ఎవరో తెలుసా?
ఎ) రామ్‌ చరణ్‌ బి) అల్లు అర్జున్‌ సి) మహేశ్‌ బాబు డి) విజయ్‌ దేవరకొండ

15 పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మెహబూబా’. ఆ చిత్రంలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘ఓ ప్రియా... నా ప్రియా.. మెహబూబా...’ రచయితెవరో తెలుసా?
ఎ) సుద్ధాల అశోక్‌తేజ బి) పూరి జగన్నాథ్‌ సి) భాస్కరభట్ల రవికుమార్‌ డి) కందికొండ

16 ‘చూసి చూడంగానే నచ్చేశావే, అడిగి అడగంగానే వచ్చేశావే...’ పాట ‘ఛలో’ చిత్రంలోనిది. ఆ చిత్రంతోనే దర్శకునిగా అరంగేట్రం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) అజయ్‌ భూపతి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) వెంకటేశ్‌ మహా

17 ‘మహానటి’ చిత్రంలోని ‘చివరకు మిగిలేది...’ అనే పాటను ‘సిరివెన్నెల’ రచించారు. ఆ పాటను ఆలపించిన గాయని ఎవరో కనుక్కోండి?
ఎ) చిన్మయ్‌ శ్రీపాద బి) సునీత ఉపద్రష్ట సి) చిత్ర డి) యస్పీ శైలజ

18 2018లో సూపర్‌హిట్‌ అయిన ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’, ‘మాటే వినదుగ, వినదుగ..’, ‘ఉండి పోరాదే గుండెల్లోన’, ‘యంతరలోకపు సుందరివో..’ పాటలను పాడిందెవరు?
ఎ) సిథ్‌ శ్రీరామ్‌ బి) రేవంత్‌ సి) కార్తీక్‌  డి) కైలాశ్‌ ఖేర్‌

19 2018లో విడుదలైన చిత్రాల్లో ఒక్క పాట కూడా లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమేంటో కనుక్కోండి? (థీమ్‌ సాంగ్‌ మాత్రం ఉంది).
ఎ) గూఢచారి బి) కేరాఫ్‌ కంచరపాలెం  సి) అ! డి) ఈ నగరానికి ఏమైంది

20 ఈ ఏడాది చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమవుతున్న బాలీవుడ్‌ సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌  బి) అమిత్‌ త్రివేది  సి) హిమేశ్‌ సేషమ్మియా  డి) విశాల్‌ భరద్వాజ్‌


మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ2) సి 3) డి 4) ఎ 5) ఎ 6) సి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) ఎ
12) డి 13) బి 14) బి 15) సి 16) బి 17) బి 18) ఎ 19) సి 20) బి

నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement