anandho brahma
-
తలకిందుల ఇంట్లో తమన్నా!
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్‌ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు. -
తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'
తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ తాప్సీ. తెలుగులో గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటి, హిట్ సినిమాల్లో నటించినా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. బేబీ, పింక్ సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ సౌత్ ఇండస్ట్రీ మీద కూడా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. అయితే బాలీవుడ్లో కూడా ఫ్లాప్ ఎదురవ్వటంతో ఇప్పుడు మరోసారి టాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటి. సౌత్‌లో సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ జానర్లో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో తాప్సీ చంద్రముఖి తరహా పాత్రలో కనిపించనుందట. మహీ రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రఘు, షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'