విభిన్నంగా రెజీనా ‘నేనే నా..?’ | Regina Cassandra New Movie Nene Na First Look Released By Varun Tej | Sakshi
Sakshi News home page

నేనే నా..? ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన వరుణ్‌ తేజ్‌

Published Tue, Mar 3 2020 8:05 PM | Last Updated on Tue, Mar 3 2020 8:17 PM

Regina Cassandra New Movie Nene Na First Look Released By Varun Tej - Sakshi

ఎస్‌ఎమ్‌ఎస్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు చెన్నై బ్యూటీ రెజీనా కసండ్ర. తెలుగుతో పాటు తమిళ, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పలు హిట్‌ చిత్రాల్లో నటించినప్పటికీ రెజీనాకు సరైన గుర్తింపు దక్కలేదు. కాగా గతేడాది ఎవరు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగులో సరైన అవకాశాలు లేనప్పటికీ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నేనే నా..?. మిస్టరీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘నిను వీడని నీడను నేనే’ డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాల‌జిస్ట్‌గా కనిపించనున్నారు. (ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ ఇదే..)

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మంగళవారం విడుదల చేశారు. ఇనుప చువ్వలతో కప్పి ఉన్న ఓ గదిలో.. కట్టు బొట్టుతో రాణిలా కనిపిస్తున్న రెజీనా. పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంటుంది. మరోవైపు తమిళ ఫస్ట్‌ పోస్టర్‌ను విజయ్‌ సేతుపతి ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. తమిళంలో ఈ చిత్రానికి శూర్పణగై అనే టైటిల్ పెట్టారు. అంటే, తెలుగులో శూర్పణఖ అని అర్థం. రాజ శేఖర్‌ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు.  పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (నా భార్య కోసం బతకాలనుకుంటున్నాను: నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement