పవర్‌నే ఆయుధంగా... | First look of Ravi Teja's Power​ | Sakshi
Sakshi News home page

పవర్‌నే ఆయుధంగా...

Published Sun, Jan 26 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

పవర్‌నే ఆయుధంగా...

పవర్‌నే ఆయుధంగా...

మాస్ ప్రేక్షకులు ఇష్టపడే హీరోల్లో రవితేజ ఒకరు. ఆయన్ను అభిమానంగా మాస్ మహారాజా అని కూడా పిలుస్తుంటారు. త్వరలో ఆయన ‘పవర్’ అనే మాస్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి)ని దర్శకునిగా పరిచయం చేస్తూ... రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగా ఇందులో రవితేజ పాత్ర చిత్రణ ఉంటుందని ఈ సందర్భంగా దర్శకుడు చెప్పారు. తనకున్న ‘పవర్’నే ఆయుధంగా చేసుకొని పోరాడిన ఓ పోలీస్ అధికారి కథ ఇదని, రవితేజ మార్క్ ఫన్ కూడా ఇందులో ఉంటుందని ఆయన తెలిపారు.
 
  రవితేజ పుట్టినరోజున ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కథకు, రవితేజ ఇమేజ్‌కి సరిగ్గా సరిపోయే టైటిల్ ఇదని నిర్మాత చెప్పారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని ఆయన తెలిపారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, ముఖేష్‌రుషి, ఆదిత్యమీనన్, ‘మిర్చి’ సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, సంగీతం: తమన్, కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మకడలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement