జనవరి 1న థియేటర్లలో 'క్రావెన్: ది హంటర్' రిలీజ్ | Kraven the Hunter Movie Release In India | Sakshi
Sakshi News home page

జనవరి 1న థియేటర్లలో 'క్రావెన్: ది హంటర్' రిలీజ్

Published Tue, Dec 17 2024 5:53 PM | Last Updated on Tue, Dec 17 2024 5:56 PM

Kraven the Hunter Movie Release In India

హాలీవుడ్ నుంచి వస్తున్న మరో యాక్షన్ డ్రామా 'క్రావెన్: ది హంటర్'. మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాకు ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు.

(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)

'కోపం, ఆవేశంతో సెర్గీ.. ఇద్దరు పిల్లలని టీనేజ్‌లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను సులభంగా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయడు. అందుకు కూడా ఓ జస్టిఫికేషన్ ఉంది. చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశంతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథకి ఆయువుపట్టు' అని దర్శకుడు చెప్పాడు.

ఈ సినిమాలో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement