
ఒకప్పటి జనరేషన్ కి సూపర్ హీరోల గురించి బాగా తెలుసు. ఎందుకంటే హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్.. ఇలా చాలా చిత్రాల్ని చూసి ఎంజాయ్ చేశారు. రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గర మూవీస్ రాలేదని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)
తాజాగా మరోసారి 'సూపర్ మ్యాన్'ని తీసుకొచ్చేందుకు వార్నర్ బ్రదర్స్ సిద్ధమైంది. జూలై 11న మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా స్నీక్ పీక్ పేరుతో ఐదు నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు.
మంచు ఎక్కువగా ఉన్న చోట సూపర్ మ్యాన్ సృహ లేకుండా పడిపోవడం, అతడి పెంపుడు కుక్క వచ్చి అతడిని మళ్లీ బతికించడం చూపించారు. విజువల్స్ అయితే బాగున్నాయి. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)