
లండన్: డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ గర్భవతిగా ఉన్న సమయంలో రాయల్ ఫ్యామిలీ నుంచి రక్షణ లేదనే భావానికి లోనయ్యారట. ఓ టాబ్లాయిడ్ న్యూస్‌పేపర్‌పై వేసిన దావా కేసులో మేఘన్ తరఫు లాయర్లు కోర్టుకు అందజేసిన పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. (టిక్‌టాక్ బ్యాన్: చైనాకు ఎంత నష్టమో తెలుసా?)
2018 ఆగస్టులో మేఘన్ తన తండ్రి థామస్ మార్కెల్‌కు రాసిన ఉత్తరాలు ఇవేనంటూ అసోసియేటెడ్ న్యూస్ పేపర్స్ అనే పబ్లిషర్‌కు చెందిన ‘ది మెయిల్’ట్యాబ్లాయిడ్లో ప్రచురించింది. మేఘన్, ఆమె తండ్రికి మధ్య చానాళ్లుగా విభేదాలు ఉన్నాయి. థామస్, మేఘన్ పెళ్లికి హార్ట్ సర్జరీ వల్ల హాజరుకాలేకపోయారు. (ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు)
మేఘన్‌కు అతి సన్నిహితులైన ఐదుగురు స్నేహితులు చెప్పారంటూ లేఖల్లోని సారాంశాన్ని ది మెయిల్ టాబ్లాయిడ్లో రాసుకొచ్చింది. దీనిపై మేఘన్ మానసిక సంఘర్షణకు గురయ్యారని, మెంటల్ హెల్త్ దెబ్బతిందని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు దాఖలు చేసిన దావా పత్రాల్లో పేర్కొన్నారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment